Top Stories

కంటతడి.. రషీద్ కుటుంబాన్ని ఓదార్చిన జగన్

వినుకొండలో టీడీపీ గుండా చేతిలో రెండ్రోజుల కిందట అతికిరాతకంగా హత్యకు గురైన వైఎస్సార్‌సీపీ యువ కార్యకర్త రషీద్‌ కుటుంబాన్ని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరామర్శించారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి.. రాష్ట్రంలో అన్నీ దారుణాలకు తెగబడుతున్నారని అన్నారు.

జగన్‌ను చూడగానే రషీద్‌ తల్లిదండ్రులు, బంధువులు భావోద్వేగానికిలోనూ కంటతడి పెట్టారు. వారిని ఓదార్చిన ఆయన.. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. చంపేసేంత కక్షలు లేవు.. ఎందుకిలా జరిగింది? అని ఆరా తీశారాయన. అయితే అవి పాత కక్షలు కావని, రాజకీయ కక్షలే అని రషీద్‌ తల్లి జగన్‌కు వివరించారు.

వైఎస్సార్‌సీపీ కోసమే రషీద్‌ తాపత్రయపడ్డాడు. రాజకీయ కక్షతోనే మా కొడుకును బలి తీసుకున్నారు. ఇప్పుడు మమ్మల్ని బెదిరిస్తున్నారు. నిందితుడు జిలానీకి టీడీపీతో సంబంధాలు ఉన్నాయి. ఎఫ్‌ఐఆర్‌లో ప్రధాన నిందితుల పేర్లు చేర్చలేదు. ఆయుధం సరఫరా చేసిన వ్యక్తి పేరు చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదు. నిందితుడు జిలానీ వెనుక టీడీపీ వాళ్లు ఉన్నారు. జిలానీ కాల్‌ డేటా తీస్తే హత్య వెనుక ఎవరున్నది తెలిసిపోతుంది. నా కొడుకును చంపిన వాళ్లను రోడ్డుపైనే ఉరి తీయాలి అని రషీద్‌ తల్లిదండ్రులు కోరారు.

ఆ సమయంలో టీడీపీ నేతలతో జిలానీ ఉన్న ఫొటోలను జగన్‌కు రషీద్‌ కుటుంబ సభ్యులు చూపించారు. ‘‘హత్య వెనుక ఎవరున్నా వదలం. మీ కుటుంబానికి అండగా ఉంటాం’’ అని రషీద్‌ కుటుంబ సభ్యులకు జగన్‌ ధైర్యం చెప్పారు. ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నీ దారుణాలే. కాపాడాల్సిన పోలీసులే నిందితులకు వత్తాసు పలుకుతున్నారు. మోసపు మాటలతో అధికారంలోకి వచ్చారు. ఇచ్చిన ఏ హామీని నెరవేర్చడం లేదు’ అని అన్నారాయన. అలాగే.. రషీద్‌ కుటుంబానికి అండగా ఉంటామని జగన్‌ హామీ ఇచ్చారు.అంతకు ముందు రషీద్‌ చిత్రపటానికి ఆయన నివాళులర్పించారు. ఈ పరామర్శలో జగన్‌ వెంట పలువురు కీలక నేతలు కూడా ఉన్నారు.

-ఏపీ అరాచకాలపై ఢిల్లీలో ధర్న : జగన్

యువ కార్యకర్త రషీద్‌ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం.. వైఎస్ జగన్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు
‘‘ఏపీలో జరుగుతున్న దాడులపై, అరాచకపాలనపై ప్రధాని మోదీ సహా అందరినీ కలుస్తాం. రాష్ట్రంలో జరుగుతున్న దాడుల్ని వివరిస్తాం. రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్‌ చేస్తాం. రాష్ట్ర అరాకపాలనకు నిరసనగా ఢిల్లీలో ధర్నా చేస్తాం’’ అని అన్నారాయన. ఇక.. వచ్చే బుధవారం ఢిల్లీలో జగన్‌ నేతృత్వంలో ధర్నా చేస్తారని, ఇందులో వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా పాల్గొంటారని వైఎస్సార్‌సీపీ ప్రకటించింది.

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories