Top Stories

జగన్ విషయంలో బాబు చేసిన తప్పు ఇదే?

ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ ని లైట్ తీసుకుంటున్నారా అంటే అదే అనిపిస్తోంది అని అంటున్నారు. చంద్రబాబు తాజాగా తన పార్టీకి చెందిన ఎంపీలు కేంద్ర మంత్రులతో ఒక సమావేశం పెట్టి పార్లమెంట్ సమావేశాలలో అనుసరించాల్సిన విధానాల గురించి దిశా నిర్దేశం చేశారు.

ఏపీకి సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చుకోవడం మీద దృష్టి సారించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా జగన్ ఢిల్లీలో ఈ నెల 24న జగన్ ధర్నా చేస్తారు అన్నది సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలిసింది.

దాని మీద చంద్రబాబు మాట్లాడుతూ జగన్ ఏమి చేస్తారు అన్నది పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది. వైసీపీ గురించి కానీ జగన్ గురించి కానీ ఆలోచించడం కంటే రాష్ట్రం గురించి ప్రజల గురించి అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచన చేయాలని చంద్రబాబు సూచించినట్లుగా తెలిసింది. ప్రజల కోసం ఏపీ అభివృద్ధి కోసం పనిచేయాలని జగన్ ధర్నాలు ఏమి చేసుకున్నా అసలు పట్టించుకోవద్దని బాబు అన్నట్లుగా తెలుస్తోంది. జగన్ ఢిల్లీలో ఏమి చేస్తారు అన్నది ముఖ్యం కాదని టీడీపీ ఎంపీలు కేంద్ర మంత్రులు ఎపీ స్టేట్ కోసం ఏమి చేస్తారు అన్నదే ముఖ్యం కావాలని ఆయన అన్నరని తెలుస్తోంది.

ప్రజలు అందించిన అధికారంతో వారికి మేలు చేయాలని ఆ దిశగానే అంతా అడుగులు వేయాలని బాబు అన్నట్లుగా తెలుస్తోంది. ఇక పోతే ఈ నెల 24న జగన్ ఢిల్లీలో ధర్నాను తన పార్టీకి చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలతో కలసి చేయబోతున్నారు వినుకొండలో రషీద్ అనే కార్యకర్త హత్య తరువాత జగన్ ఈ ప్రకటన చేశారు. ఏపీలో శాంతి భద్రతలు ఏ మాత్రం లేవని చెబుతూ ఆయన ఢిల్లీ నడిబొడ్డున ఈ ఆందోళన చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు ఒక వైపు జరుగుతున్న టైం లో ఈ ఆందోళన చేయడం ద్వారా కేంద్ర పెద్దల దృష్టికి ఏపీ సమస్యను తీసుకుని రావాలన్న్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు.

అయితే చంద్రబాబు మాత్రం జగన్ ఏమి చేసినా లైట్ గానే తీసుకోవాలని అంటున్నారు. ఇటీవలే ప్రజలు కూటమికి భారీ మెజారిటీ ఇచ్చారు. దాంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి గట్టిగా రెండు నెలలు కాలేదు ఇంతలో ఆందోళలను అంటూ వైసీపీ జనంలోకి వెళ్ళినా మద్దతు దొరకదని అంటున్నారు. అదే టైంలో ప్రభుత్వం అభివృద్ధి మీద దృష్టి పెడితే ఇలాంటి నిరసనలు ఎన్ని చేసినా జనాలు కూడా ఆ వైపు చూడరు అన్నదే బాబు ఆలోచనగా ఉంది అంటున్నారు. మొత్తానికి జగన్ కూటమి అధికారంలోకి వచాక తొలిసారి చేపడుతున్న ఆందోళన పట్ల కూటమిలో ఒకింత మేకపోతు గాంభీర్యం ఆందోళన అయితే ఉంది..

Trending today

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

Topics

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

Related Articles

Popular Categories