Top Stories

జగన్ తో రఘురామ.. అసెంబ్లీలో అదిరిపోయే సీన్

ఏపీ అసెంబ్లీలో ఇవాళ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో బద్ధ శత్రువులుగా పేరు తెచ్చుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఇవాళ అసెంబ్లీ సమావేశాల వేళ కలుసుకున్నారు. అసలే ఇవాళ గవర్నర్ ప్రసంగానికి నిరసనలు తెలిపేందుకు నల్ల కండువాలతో వచ్చిన జగన్ కు లాబీల్లో రఘురామ కనిపించారు. దీంతో వీరిద్దరి మధ్య ఆసక్తికర సన్నివేశాలు జరిగాయి.

ఇవాళ అసెంబ్లీకి హాజరైన వైఎస్ జగన్ కు లాబీల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కనిపించారు. అంతే వెంటనే రఘురామ ఆయన్ను పలకరించారు. అంతే కాదు ఆయన వద్దకు వెళ్లి మాట్లాడారు. అయితే వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ కొన్ని నిమిషాల పాటు మాట్లాడుకున్న తర్వాత వీరిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఈ దృశ్యం చూసిన వాళ్లంతా నోరెళ్లబెట్టక తప్పలేదు.

ఇప్పటికే వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై హత్యాయత్నం చేశారంటూ జగన్ తో పాటు అప్పటి అధికారులపై కేసు పెట్టిన రఘురామకృష్ణంరాజు.. తాజాగా గుంటూరు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో జగన్ కనిపించగానే రఘురామరాజు ఆయన వద్దకు ఎందుకు వెళ్లారు, ఏం మాట్లాడారన్న దానిపై చర్చ జరుగుతోంది.
ఇప్పటికే కూటమి ప్రభుత్వం తనకు స్పీకర్ లేదా మంత్రి పదవి ఇస్తుందని ఆశించిన రఘురామకు నిరాశ తప్పలేదు. ఈ నేపథ్యంలో జగన్ తో మాటామంతీ ద్వారా చంద్రబాబుకు ఆయన భవిష్యత్ సంకేతం ఇచ్చారా అన్న చర్చ జరుగుతోంది.

Trending today

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

Topics

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

Related Articles

Popular Categories