Top Stories

Vallabhaneni Vamsi Arrest : వల్లభనేని వంశీ అరెస్ట్

Vallabhaneni Vamsi Arrest : గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం దగ్గరలో ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా వంశీని గన్నవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇప్పటికే వంశీని పట్టుకునేందుకు కొన్ని బృందాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. వంశీ అరెస్ట్ తెలుగు రాజకీయాల్లో సంచలనమైంది.

గత హయాంలో మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీనే ఇది చేసిందని టీడీపీ ఆరోపించింది.. అయినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం మారడంతో కేసు పరిణామాలు కనిపిస్తున్నాయి. అంతకుముందు కొంతమంది అధికారులను సస్పెండ్ చేశారు.

దీనికి సంబంధించి ఇప్పటి వరకు 18 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు అందరి దృష్టి వల్లభనేని వంశీ మోహన్‌పై పడింది. అతని కోసం కొన్ని పోలీసు బృందాలు వెతుకుతున్నాయని, వీలైనంత త్వరగా అరెస్టు చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.. ఈ కేసులో ఆరోపణ ఉన్నందున వంశీని ఈరోజు అరెస్టు చేసినట్లు సమాచారం.

వంశీ ఏపీలో లేరని, ఫలితాలు వెలువడిన తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చారనే అభిప్రాయం వ్యక్తమైంది. ఫలితాల అనంతరం వంశీ రాష్ట్రంలో లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యేను పట్టుకునేందుకు పోలీసు బృందాలను హైదరాబాద్‌కు పంపారు. టీడీపీ టికెట్‌పై గెలిచిన వంశీ ఆ తర్వాత జగన్ పిలుపుతో వైసీపీకి దగ్గరయ్యారు. ఆయన గత టర్మ్‌లో చంద్రబాబును, టీడీపీని టార్గెట్ చేశారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన గుంపును ఉసిగొల్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయినా అతనిపై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొత్త ప్రభుత్వం వచ్చినందున కేసు వేగంగా కదులుతోంది. వంశీ అరెస్ట్ తో ఈ కేసు సంచలనంగా మారింది.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories