Top Stories

వైసిపి తగ్గేదేలే..

‘నీయవ్వ తగ్గేదేలే’ ఇది ఒక సినిమాలో ప్రముఖ నటుడు చెప్పే డైలాగ్. కానీ ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఇదే డైలాగును బలంగా చెబుతున్నారు. ఎందుకంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత వైసిపి పని అయిపోయిందంటూ ఎంతోమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఆ పార్టీలో ఎవరు ఉండరు అన్న వాదనను ఎంతోమంది వినిపిస్తున్నారు. అటువంటి వారికి వైసిపి శ్రేణులు, ఫాలోవర్స్ గణాంకాలను చూపించి మరి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా 2014లో ఎదుర్కొన్న పూర్తిస్థాయి ఎన్నికల్లో 44.9% ఓటు బ్యాంకును వైసిపి సాధించింది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ 49.95% ఓటింగ్ తో తొలిసారి అధికారాన్ని దక్కించుకుంది. గతంలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో 151 స్థానాల్లో వైసిపి విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఐదేళ్లు గడిచాయి 2024లో జరిగిన ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ ఓటమిపాలైంది. 11 స్థానాలే వచ్చినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీకి 40 శాతం మంది ఓట్లు వేశారు. ఇప్పటికీ సింగిల్ గా పోటీ చేస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మించిన బలమైన పార్టీ మరొకటి లేదంటూ పలు సర్వే సంస్థల అధినేతలు పేర్కొన్నారు. వైసీపీకి గడిచిన ఎన్నికల్లో వచ్చిన 40 శాతం మంది ఓటర్లలో ఒక్కరిని కూడా బయటకు పంపించలేరని, వారంతా జగన్మోహన్ రెడ్డిని చూసి ఓట్లు వేసిన వారిని ఆ పార్టీ అభిమానులు చెబుతున్నారు.

ప్రస్తుత ప్రభుత్వ విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలు నచ్చక వైసీపీ వైపు వచ్చే వాళ్ళు ఉంటారే తప్ప.. ఈ 40 శాతం మందిలో అటువైపు వెళ్లే వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు అంటూ బలంగా వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. తమ పార్టీ పని అయిపోయింది అని భావించే వాళ్లకు ఈ గణాంకాలను చూపించి ఇది తమ సత్తా అంటూ స్పష్టం చేస్తున్నారు. ఏపీలో ఉన్న పార్టీలు తల కింద పెట్టి కాలు పైన పెట్టిన కూడా ఎంత ఓట్ షేర్ రాదు అంటూ శపథలు చేస్తున్నారు. వైసీపీ శ్రేణులు ఈ గణాంకాలతో కూడిన కొన్ని వీడియోలను షేర్ చేస్తూ ‘తగ్గేదేలే’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. నిజంగానే క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే వైసిపి తగ్గేదే లేదు అన్నట్టుగానే ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో అది వైసీపీకి మరింత బలంగా మారే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అదే జరిగితే జమిలి ఎన్నికలు జరిగినా, షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు వచ్చిన వైసీపీ విజయాన్ని ఆపే సత్తా ఎవరికి ఉండదని వ్యాఖ్యానిస్తున్నారు.

https://x.com/bhargavreddyyy/status/1848784700644696529?t=LIw0lA7aVn-tYXfkbaAdRw&s=08

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories