Top Stories

అది 1996.. బాబుగారి శాడిజం కథ

*సొంత పిల్లనిచ్చిన మామనే గద్దెదించి సీఎం అయిన చరిత్ర బాబు గారిది.. అందుకే వైసీపీ ఎప్పుడూ అంటుంది.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులో మానవత్వం మట్టుకు కూడా కనిపించదని… ఆయన చూపించే ప్రేమాభిమానాలన్నీ మాటలకు మాత్రమే పరిమితం. ఇచ్చే హామీలు ఎన్నికలు వరకే. ఈ విషయం రాష్ట్రంలోని చాలా మందికి తెలుసు. అతికొద్ది మందికి మాత్రమే ఆయన నిజ స్వరూపం తెలియదు. అటువంటి నిజాల్లో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. వైసీపీకి చెందిన అధికార ప్రతినిధి శ్యామల ఈ విషయాన్ని బయటకు వెల్లడించడంతో ఎంతో మంది ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు. శ్యామల చెప్పిన విషయంలోకి వెళితే.. అది 1996 నాటి కథ.

అప్పట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో ఒక యువతిపై యాసిడ్‌ దాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన యువతి వైద్య ఖర్చులు కోసం ఐదు లక్షలు రూపాయలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడిలో ఏమాత్రమైనా మానవత్వం ఉండుంటే ఆయనే స్వయంగా బాధిత యువతిని పరామర్శించి వైద్యం చేయిస్తామని ప్రకటించాలి. కానీ, ఆయన ఆ పని చేయలేదు. పైగా కోర్టు ఐదు లక్షలు వైద్య ఖర్చులకు ఇవ్వాలని చెప్పిన విషయాన్ని బేఖాతరు చేస్తూ హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు.

ఈ విషయంపై అప్పట్లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కూడా చంద్రబాబును విమర్శించారు. ఆడ పిల్లకు డబ్బులు ఇవ్వడానికి కూడా చేతులు రావడం లేదా..? చంద్రబాబు అంటూ వైఎస్‌ఆర్‌ ప్రశ్నించారు. ఇదీ చంద్రబాబు శాడిజంలోని ఒక కథ మాత్రమే. ఇలాంటివి చంద్రబాబు జీవితంలో కోకొల్లలు. అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు మానవత్వం, సంక్షేమం గురించి మాటలు చెబుతుంటే.. అప్పటి విషయాలు తెలిసిన ఎంతో మంది నవ్వుకుంటున్నారు. ఇదీ సార్‌ చంద్రబాబు నాయుడు మార్క్‌ శాడిజం అంటూ ఈ ఘటనను తాజాగా మీడియా ముఖంగా శ్యామల మరోసారి బహిర్గతం చేయడంతో దీనిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

Trending today

దళిత యువకుడికి చంద్రబాబు షాక్.. అలా చేశారేంటి?

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాలన శైలిని మార్చుకున్నారా? ప్రజల్లో...

కలిసిన కిరాక్ ఆర్పీ-సీమరాజా.. ఇదేం మా వార్నింగ్

    కిరాక్ ఆర్పీ దంపతులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని లక్ష్యంగా...

అఘోరి-శ్రీవర్షిణి పెళ్లి.. షాకింగ్ వీడియోలు

  మధ్యప్రదేశ్‌లోని ఒక చిన్న ఆలయంలో అఘోరీ మరియు శ్రీ వర్షిణి అనే...

గేదెలకు కుడితి కలుపుతున్న చంద్రబాబు.. వైరల్ వీడియో

  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల చేస్తున్న కొన్ని పనులు...

పవన్ ను తిడుతుంటే నవ్విన రాయపాటి అరుణ.. వైరల్ వీడియో

  ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాలనపై జరిగిన టీవీ లైవ్...

Topics

కిరణ్ పాపం పండింది.. ఇదీ వైసీపీ విజయం

గుంటూరు పోలీసులు వైయస్ భారతి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో...

ఈ నీచుడిని అరెస్ట్ చేసి లోపలేయండి

  రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికారంలో ఉన్న కూటమి...

వైసీపీ వ్యతిరేకులు గుర్తుపెట్టుకోండి!

  వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, ఆయన కుటుంబాన్ని వ్యక్తిగతంగా దూషిస్తూ, కించపరుస్తూ...

Related Articles

Popular Categories