Top Stories

‘బాబు’ గారి పాలనా వైభవం.. వైరల్‌ వీడియో

శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలాన్ని స్వర్ణయుగంగా చెబుతారు. ఆయన పాలనా కాలంలో రోడ్డుపైనే రత్న, రాశులను విక్రయించేవారని చరిత్రలో చదువుకున్నాం. శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలం స్వర్ణయుగం అయితే.. ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు జమానాలోని ఏపీ మద్యం మయంగా ఎంతో మంది పేర్కొంటున్నారు. అప్పట్లో రాయల వారి పాలనలో రోడ్డుపై రత్న, రాశులను పోసి విక్రయిస్తే.. ప్రస్తుతం బాబుగారి పాలనలో రోడ్డుపైనే మద్యం బాటిళ్లను పెట్టి చిన్నారులతో విక్రయాలు సాగిస్తున్నారు.

దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతోంది. బాబుగారి జమానాలో ఏరులైన పారుతున్న మద్యం అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రాయల పాలనలో మణి, మాణిక్యాల విక్రయాలను చూస్తే.. చంద్ర రాయలు పాలనలో రోడ్డు మీద పసిపిల్లలతో మద్యం అమ్మడం చూస్తున్నామంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మాబాబు గారి జమానా మహాద్భుతమైన పాలన సాగుతోందంటూ సామాజిక మాధ్యమాల్లో ఫేక్‌ ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్న వారికి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న ఈ వీడియో చెంపపెట్టులాంటిదని పలువురు పేర్కొంటున్నారు.

మద్యాన్ని ప్రదాన ఆధాయ వనరుగా, పచ్చ తమ్ముళ్ల జేబులను నింపే కల్పతరువుగా మద్యం విధానాన్ని మర్చిన చంద్రబాబు పాలన గురించి ఇప్పుడేమి చెబుతారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుండగా, కామెంట్లు కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇది యాపారం అంటూ పలువురు కామెంట్లు చేస్తుండగా, ఇదీ బాబోరి విజన్‌ అంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. స్కూల్‌కు వెళ్లి చదువుకోవాల్సిన చిన్నారులను మద్యం విక్రయించే స్థితికి తీసుకువచ్చిన బాబు విజన్‌ అంటే ఇదేనేమో అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. ఇంటికో ఉద్యోగం అన్న చంద్రబాబు.. పిల్లలకు కూడా ఉద్యోగాలను కల్పించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Trending today

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

టీడీపీ బాయ్‌కాట్… కానీ అర్నాబ్‌కు మహా వంశీ సన్మానం

లోకేష్‌ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి...

ఏపీ ఆర్థిక ‘సుడిగుండం’పై సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న...

Topics

అమరావతికి షాక్.. పాపం ‘కూటమి’

అమరావతిని చట్టబద్ధ రాజధానిగా స్థిరీకరించాలనే దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. గెజిట్...

పో పోవయ్యా ‘బాబు’

ఎమ్మెల్యేలు మాత్రమే కాదు... ఏకంగా మంత్రులు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

దువ్వాడ మరో సంచలనం

వైసీపీ నుంచి బహిష్కృతుడైన దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలతో మరోసారి సంచలనం...

Related Articles

Popular Categories