Top Stories

జగన్ ను తక్కువ అంచనా వేస్తే దెబ్బైపోతారు.. వైరల్ వీడియో

తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డిది విలక్షణమైన శైలి. పోరాట తత్వం ఆయన నైజంగా అందరూ అంగీకరించే పరిస్థితి. రాజకీయాల్లోకి రాకముందే పరిటాల రవి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సిబిఐ విచారణకు డిమాండ్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ విచారణను సైతం ఎదుర్కొన్నారు. ఆ తర్వాత విజయవంతమైన బిజినెస్ మాన్ గా పేరు గడించారు జగన్మోహన్ రెడ్డి. దురదృష్టవశాత్తు తండ్రి మరణాంతరం ఓదార్పు యాత్రకు సిద్ధమైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం దానికి అడ్డు చెప్పింది. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని బేఖాతరు చేస్తూ ఓదార్పు యాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈ పర్యవసానాలతో సిబిఐ, ఈడి విచారణను ఎదుర్కొన్న వలసిన పరిస్థితి ఏర్పడింది. కేసులు విచారణ దశలో ఉండగానే సుమారు 16 నెలలపాటు జైల్లో ఉన్న ఏకైక నేతగా కూడా ఆయన నిలిచారు. జైల్లో ఉన్నప్పటికీ ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తన రాజకీయ జీవితాన్ని ముందుకే నడిపించారు. పోరాటాలతో మరింత బలమైన నేతగా ఎదిగిన జగన్మోహన్ రెడ్డి.. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 67 స్థానాలను సాధించి బలమైన ప్రతిపక్షనేతగా నిలిచారు. అధికార పార్టీ వేధింపులు, ఇబ్బందులను ఎదుర్కొంటూ 2019లో జరిగిన ఎన్నికల్లో 151 స్థానాల్లో అఖండమైన విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశ చరిత్రలోనే 50కిపైగా ఓటింగ్ తో 75 శాతానికిపైగా స్థానాలను సాధించి విజయం సాధించిన ఏకైక నాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రపంచమంతా గుర్తించిన నేతగా జగన్మోహన్ రెడ్డికి ఎంతో పేరు ఉంది. అటువంటి నాయకుడు ప్రస్తుతం తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

గడచిన కొన్నాళ్లుగా ఎదురవుతున్న పరిస్థితులను చూసి ఈ రాజకీయాలు ఎందుకు అంటూ ఆయన బయటకు వెళ్లాల్సిన పరిస్థితిని సృష్టిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మొండి వ్యక్తి కాబట్టి నిలబడుతున్నాడు. సప్త సముద్రాలను ఈదునోడు.. తెల్ల కాలువలో పడి చచ్చినట్టుగా ఇంటి రచ్చతో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తీవ్ర ఇరకాటంలో పడినట్టు అయింది. కుటుంబ పరంగా వస్తున్న ఇబ్బందులతో ఆయన తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. సిబిఐ విచారణలు, ఈడీ కేసులను ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డి ఇంటిలో నెలకొన్న సమస్యను పరిష్కరించుకోలేక సతమతమవుతున్నాడు. ఇప్పటికీ కోట్లాదిమంది ప్రజల అభిమానాన్ని ఆయన సంపాదిస్తూనే ఉన్నాడు. ఒక రాష్ట్ర నాయకత్వం, ఒక సినిమా నటుడు, కేంద్ర నాయకత్వం కలిసి పోటీచేసిన 40 శాతం పైగా ఓటు బ్యాంకు సాధించిన నాయకుడిగా ఆయనకు ఇప్పటికీ ప్రజల్లో మంచి పేరే ఉంది. 60 శాతం తన సంపాదనలో నుంచి ఆస్తి రాసిచ్చి కూడా చెల్లి నుంచి ఇబ్బందులను ఎదుర్కోవడం జగన్ ను ఒకరకంగా మానసికంగా ఒత్తిడిని కలిగిస్తున్న విషయంగానే చెప్పాలి.

చివరికి తను సంపాదించిన ఆస్తులను వాటాగా రాసి ఇచ్చిన తరువాత తల్లి, చెల్లి ఇద్దరూ టార్గెట్ గా చేసుకునే రాజకీయాలను సాగించే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఈ గోలంతా ఎందుకు అని రాజకీయాలకు వదిలేస్తాడా.? తనకు తొలి నుంచి అలవాటైన పోరాటాన్ని నమ్ముకుని ముందుకు సాగుతాడా.? అన్నది చూడాల్సి ఉంది. ఈ వీడియోని చూసిన ఎంతోమంది దమ్మున్న నాయకుడు జగన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. జగన్ పని అయిపోయింది అనుకునే వాళ్ళు.. చాలా జాగ్రత్తగా ఉండాలంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. దెబ్బతన చిరుత పులి లాంటి వాడు జగన్.. దెబ్బకు దెబ్బ తీస్తాడు అంటూ ఇంకొంతమంది వ్యాఖ్యానిస్తూ వీడియోను వైరల్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం, గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులకు సంబంధించిన అంశాలను జర్నలిస్టు సాయి ఎనాలసిస్ చేస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Trending today

టీడీపీ అరాచకాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం టీడీపీ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలు విస్తృతంగా పెరిగిపోతున్నాయనే ఆరోపణలు...

టీడీపీ డమ్మీ.. లైవ్ లో వెంకటకృష్ణ అరాచకం

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా జైలు నుంచి విడుదలైన వెంటనే,...

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

Topics

టీడీపీ అరాచకాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం టీడీపీ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలు విస్తృతంగా పెరిగిపోతున్నాయనే ఆరోపణలు...

టీడీపీ డమ్మీ.. లైవ్ లో వెంకటకృష్ణ అరాచకం

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా జైలు నుంచి విడుదలైన వెంటనే,...

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

Related Articles

Popular Categories