Top Stories

అయ్యా పవన్.. ఈ ఏడు ప్రశ్నలకు సమాధానం చెప్పు

ఏపీలో జరుగుతున్న దారుణాలు, అత్యాచారాలు, హత్యాకాండలపై ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా వినియోగదారులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిందులు వేశారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్న వారిని ఉపేక్షించేది లేదంటూ వ్యాఖ్యానించిన ఆయన తాటతీస్తామని మాట్లాడారు. ఈ మాటను చూసిన పలువురు సామాజిక మాధ్యమాలు వేదికగా పవన్ కళ్యాణ్ ను నిలదీస్తున్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు సోష‌ల్ మీడియాలో ఆడ‌ పిల్ల‌ల‌పై నీచంగా మాట్లాడితే తాట తీస్తాం అని బ‌హుబాగా సెల‌విచ్చిన మీరు.. ఈ ప్ర‌శ్న‌లకు సమాధానాలు చెప్పండి అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు ఆ ప్రశ్నలేంటో మీరు చూడండి.

* రాష్ట్రంలో 35 వేల మంది ఆడ‌పిల్ల‌లు మాయ‌మ‌య్యార‌ని, కేంద్ర నిఘా వ‌ర్గాల స‌మాచారం ఉంద‌ని ఎన్నిక‌ల ముందు చెప్పావు క‌దా? అధికారంలోకి వ‌చ్చి ఐదు నెల‌లు అవుతున్నా ఆ విష‌యంపై ఎందుకు మాట్లాడ‌డం లేదు? నిందితుల‌ను ప‌ట్టుకుని ఎందుకు తాట తీయ‌లేదు?

* కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక దాదాపు 77 మందికిపైగా మ‌హిళ‌ల‌పై దాడులు జ‌ర‌గ‌గా, అందులో కొంత‌ మందిపై అత్యాచారాలు, హ‌త్య‌లు జ‌రిగాయి. ఈ విష‌యంపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు మాట్లాడ‌లేదు? నిందితుల తాట ఎందుకు తీయ‌లేదు?

* మ‌హిళ‌ వేధింపు కేసులో మీ జ‌న‌సేన పార్టీ నాయ‌కుడు, కొరియోగ్రాఫ‌ర్ జానిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపిస్తే ఆ విష‌య‌మై మీరు ఎందుకు మాట్లాడ‌లేదు? జాని తాట ఎందుకు తీయ‌లేదు?

* మ‌హిళ‌ల‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని మీ పార్టీ నాయ‌కుడు దాస‌రి అశోక్‌ను గుంటూరులో మ‌హిళ‌లు చెప్పుతో కొట్టారు. ఆ విష‌య‌మై మీరు ఎందుకు మాట్లాడ‌లేదు?

* విశాఖ‌ప‌ట్నంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కురాలు, మాజీ స‌ర్పంచ్
ఉప్మాక‌పై జ‌న‌సేన పార్టీ నేత‌లు పాశ‌వికంగా దాడి చేస్తే ఆ విష‌య‌మై మీరు ఎందుకు మాట్లాడ‌లేదు?

* క‌పిల‌ తీర్థం ఆల‌య స‌ముదాయంలో గిరిజ‌న మ‌హిళ త‌న‌ను హ‌రిశంక‌ర్ రాయ‌ల్ అనే జ‌న‌సేన‌ పార్టీ నాయ‌కుడు వేధిస్తున్నాడ‌ని మీడియా ముందు ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఆ విష‌యంపై మీరు ఎందుకు మాట్లాడ‌లేదు?

* మీరు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న
పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో 16 ఏళ్ల బాలిక‌ను టీడీపీ నాయ‌కుడు ఆటోలో ఎక్కించుకుని వెళ్లి అత్యాచారం చేస్తే ఆ విష‌యంపై ఇప్ప‌టి వ‌ర‌కు మీరు ఎందుకు మాట్లాడ‌లేదు?

వీటితోపాటు టీడీపీ నాయ‌కులు దాడులు, అత్యాచారాలు స‌రేసేరి. వీళ్లందరికీ మీరు ఎప్పుడు తాట తీస్తారో చెప్పే ద‌మ్ముందా.? అంటూ సామాజిక మాధ్యమాలు వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సినిమాల్లో డైలాగులు చెప్పినంత సులభం కాదంటూ పలువురు పవన్ కళ్యాణ్ తీరుపై మండిపడుతున్నారు.

డిప్యూటీ సీఎం @PawanKalyan ..
సోష‌ల్ మీడియాలో ఆడ‌పిల్ల‌ల‌పై నీచంగా మాట్లాడితే తాట తీస్తాం అని బ‌హుబాగా సెల‌విచ్చారు.

ఈ సంద‌ర్భంగా మిమ్మ‌ల్ని కొన్ని ప్ర‌శ్న‌లు అడుగుతున్నాం..
వీటికి స‌మాధానం చెబుతార‌ని ఆశిస్తున్నాం.

మొద‌టి ప్ర‌శ్న‌:
రాష్ట్రంలో 35వేల మంది ఆడ‌పిల్ల‌లు మాయ‌మ… pic.twitter.com/UaqkSqduF4
— YSR Congress Party (@YSRCParty) November 1, 2024

Trending today

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

టీడీపీ బాయ్‌కాట్… కానీ అర్నాబ్‌కు మహా వంశీ సన్మానం

లోకేష్‌ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి...

ఏపీ ఆర్థిక ‘సుడిగుండం’పై సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న...

Topics

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

టీడీపీ బాయ్‌కాట్… కానీ అర్నాబ్‌కు మహా వంశీ సన్మానం

లోకేష్‌ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి...

ఏపీ ఆర్థిక ‘సుడిగుండం’పై సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న...

అమరావతికి షాక్.. పాపం ‘కూటమి’

అమరావతిని చట్టబద్ధ రాజధానిగా స్థిరీకరించాలనే దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. గెజిట్...

పో పోవయ్యా ‘బాబు’

ఎమ్మెల్యేలు మాత్రమే కాదు... ఏకంగా మంత్రులు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

దువ్వాడ మరో సంచలనం

వైసీపీ నుంచి బహిష్కృతుడైన దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలతో మరోసారి సంచలనం...

Related Articles

Popular Categories