Top Stories

అయ్యా ఏబీఎన్ రాధాకృష్ణ.. ఇదేమి పని?

’చెప్పేవి శ్రీరంగ నీతుల.. దూరేవి దొమ్మర గుడిసెలు’ అన్న చందంగా తయారైంది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ పరిస్థితి. తెల్లవారి లేచిన దగ్గర నుంచి సమాజాన్ని తానే ఉద్ధరిస్తున్నానన్నట్టుగా ఈ సంస్థ ఎండీ వ్యవహరిస్తుంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి నీతి వాఖ్యాలను వల్తెవేస్తుంటారు. కానీ, చేసే వ్యవహారాలు వేరేగా ఉంటాయి. ఇవన్నీ అందరికీ తెలిసినవే. అయితే, గొప్పగొప్ప మాటలు చెప్పే రాధాకృష్ణ తన సంస్థలో పని చేసే ఉద్యోగులు విషయంలో మాత్రం అత్యంత నిర్లక్ష్యంగా కఠినంగా వ్యవహరిస్తున్నాడన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంస్థలో పని చేసే ఉద్యోగులకు పెద్దగా జీతాలు ఉండవు. చాలీ, చాలని జీతాలతోనే నెట్టుకుంటూ రావాలి. ఇచ్చే జీతాల్లోనూ ఆ సంస్థ వెల్ఫేర్‌ ఫండ్‌ పేరుతో కొంత కోతలు విధిస్తోంది. ఇదే ఇప్పుడు ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది.

చాలీ, చాలని జీతాల్లో నుంచి కోతలు విధించడంతో ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయంలో వెల్ఫేర్‌ ఫండ్‌ పేరుతో వసూలు చేసిన మొత్తంలో నుంచి ఎవ్వరికి సాయం చేశారో కూడా తెలియడం లేదు. ఈ ఫండ్‌ నుంచి ఎవరైనా రుణం పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలంటూ సవాలక్ష నిబంధనలు పెట్టారు. దీంతో ఈ ఫండ్‌ కూడా ఎవరికీ ఉపయోగపడని పరిస్థితి. అదే సమయంలో ఉద్యోగులకు వేతనాలను ఎలా కోత విధించాలన్న దానిపైనే సంస్థ యాజమాన్యం దృష్టి పెట్టినట్టు అనేక నిబంధనలు పెట్టింది. ఈ సంస్థలో ఎడిటోరియల్‌లో పని చేసే సబ్‌ ఎడిటర్లకు ఖచ్చితంగా ఇన్‌పంచ్‌, ఔట్‌ పంచ్‌ ఉండాలి. ఇందులో ఒక్క నిమిషం ఆలస్యమైనా వేతనం కట్‌ అవుతుంది.

అదనంగా పని చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం దాన్ని పరిగణలోకి తీసుకోరు. ఈ సంస్థలో గతంలో గ్రేస్‌ పీరియడ్‌ 350 నిమిషాలు వరకు ఉండేది. దాన్ని కొంత కాలంగా తగ్గించుకుంటూ వచ్చి రద్దు చేశారు. సబ్‌ ఎడిటర్లు పత్రికా ఆఫీస్‌కు వచ్చే సమయంలో ఐదు, పది నిమిషాలు ఆలస్యమైనా జీతాల్లో కోత విధిస్తారు. ఓవర్‌ టైమ్‌ చేయాల్సి వచ్చినప్పుడు అదనంగా రూపాయి కూడా చెల్లించరు. ఇవన్నీ భరిస్తూ కూడా చాలా మంది పని చేస్తూనే ఉన్నారు. దీనికి కారణం మీడియారంగంలో సరైన అవకాశాలు లేకపోవడమే. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఉద్యోగులు విషయంలో చేస్తున్న విషయాలను తెలుసుకున్న ఎంతో మంది.. అయ్యా రాధా ఇదేమి పని అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఆడింట్లో, ఈడింట్లో ఏం జరిగిందో చెప్పడమే తప్పా.. మనింట్లో, మన సంస్థలో ఏం జరుగుతుందో పట్టించుకోమా సామీ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇదేంటి ఆర్కే అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories