Top Stories

ఇదే తగ్గించుకుంటే మంచిది ’బాబు’.. వైరల్‌ వీడియో

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసే పనులకు.. చేసుకునే ప్రచారాలకు పొంతనే ఉండదు. ఇసుమంత పని చేస్తే కొండంత ప్రచారం చేసుకోవడం చంద్రబాబుకు ముందు నుంచీ అలవాటే. అందుకే చంద్రబాబు గురించి తెలిసిన ఎంతో మంది కోతల బాబు అని పిలుస్తుంటారు. తాజాగా చంద్రబాబు గొప్పలకు సంబంధించిన మరో వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను చూసిన ఎంతో మంది నెటిజన్లు ఇదే తగ్గించుకుంటే మంచిది బాబు అని కామెంట్లు చేస్తున్నారు. ఇక వీడియో విషయానికి వస్తే.. ఒక మహిళ వంటింట్లో వంట చేస్తోంది. వంట చేస్తున్న సమయంలో గ్యాస్‌ అయిపోతుంది. వెంటనే భర్తకు ఫోన్‌ చేసి గ్యాస్‌ బుక్‌ చేయమని చెబుతుంది.

సదరు మహిళ భర్త మాత్రం జీతం డబ్బులు ఖర్చు అయిపోయాయని చెబుతాడు. దీంతో ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్న మహిళకు షాక్‌ ఇచ్చేలా.. ఒక యువకుడు గ్యాస్‌ బండ పట్టుకుని ఇంట్లోకి వస్తాడు. గ్యాస్‌ బండ చూసిన ఆ మహిళ.. మావారు బుక్‌ చేశారా..? అని అడుగుతుంది. దానికి గ్యాస్‌ బండ తెచ్చిన యువకుడు లేదమ్మా బాబుగారు పంపించారు అని చెబుతారు. దానికి సదరు మహిళ చేతిలో చిల్లిగవ్వ కూడా లేదంటూ మధనపడుతుంది. దానికి ఆ యువకుడు రూపాయి కూడా అక్కర్లేదమ్మా అంటూ బాబు గారు దీపం పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నారని చెబుతాడు.

దానికి ఆనందపడుతూ సదరు మహిళ పెంచిన పెన్షన్లు గురించి, అన్నా క్యాంటీన్లు, టీసీఎస్‌ గురించి చెబుతూ గొప్పలు చెబుతుంది. ఈ వీడియోను చూసిన ఎంతో మంది.. ఓరాడెమ్మ బడవ ఇదేందిరా ఇది అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీపం పథకం కింద ఉచిత గ్యాస్‌ బండ ఎవుడ్రా తెచ్చి ఇస్తున్నది అంటూ ప్రశ్నిస్తున్నారు. ముందు డబ్బులు చెల్లిస్తే తరువాత అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తామని చెబుతున్నదీ మీరే, మళ్లీ ఇలా రూపాయి కట్టకుండా ఇంటికి బండ తెచ్చి ఇస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటున్నదీ మీరే. ఏదో ఒక్క దాని మీద స్టాండై ప్రచారం చేసుకోండర్రా అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతోంది. అయ్యా బాబుగారు ఇటువంటి ప్రచార ఆర్భాటాలు ఇప్పటికైనా మానండి అంటూ పలువురు సూచిస్తున్నారు.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories