Top Stories

చంద్రబాబు నేర్పిన గుణపాఠం

రాజకీయాల్లో చంద్రబాబును మించిన నేర్పరి మరొకరు ఉండరు. తనది కాని చోట ఒదిగి ఉండడం.. తనదైన రోజున చెలరేగిపోవడం చంద్రబాబును చూసి ఎవరైనా నేర్చుకోవాల్సిందే. రాజకీయాల్లో చంద్రబాబు వ్యూహాలు భిన్నంగా ఉంటాయి. తనను తాను సంరక్షించుకునేందుకు దేనికైనా ఆయన వెనుకాడరు. ఇప్పటి వరకు ఆయన రాజకీయ జీవితాన్ని చూసిన వాళ్లకు ఎవరికైనా ఇదే విషయం అర్థమవుతుంది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కూటమిగా ఎన్నికలకు వెళ్లడంలో కీలకంగా వ్యవహరించారు. అటువంటి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిణామాలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకానొక దశలో తాను హోం శాఖ బాధ్యతలను తీసుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు కూడా. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అగ్గి రాజేశాయి. కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ పై గుర్రుమంటున్నారు. ఈ క్రమంలోనే మందకృష్ణ మాదిగ వంటి నేతలు కూడా పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా చంద్రబాబు మార్క్ రాజకీయం అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కూటమిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని, అందరూ గౌరవిస్తారు, అదే సమయంలో తమ ఉనికికి ప్రమాదం వస్తుంది అనుకుంటే మాత్రం తీవ్రంగానే దెబ్బ తీస్తారు. ఇదే విషయాన్ని తాజాగా పవన్ కళ్యాణ్ కు కూటమి నేర్పిన గుణపాఠంగా చెప్పవచ్చు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిని అరెస్టు చేయాలంటూ పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. అయితే ఇప్పటికే ప్రభుత్వం అరెస్టులు ప్రారంభించింది. కొన్ని వాటి విషయంలో ఆలోచన చేస్తుంది.

ఎందుకంటే కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడంపై ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఆగ్రహం గానే ఉన్న తెలుస్తోంది. పోలీసులు గట్టిగా పని చేయాలని, హోంమంత్రికి హెచ్చరికలు జారీ చేయడం వంటివన్నీ ప్రభుత్వానికి దెబ్బగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వరుసగా పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా కామెంట్లు వస్తున్నాయి. మందకృష్ణ మాదిగ తో పాటు హోం మంత్రి అనిత, మరో మంత్రి అచ్చెన్నాయుడు వరకు స్ట్రాటజిక్ గా మాట్లాడి పవను ఎరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వైసిపి మాత్రమే తప్పుగా ప్రచారం చేస్తోందంటూ ప్రధాన పత్రికలు కథనాలు ప్రచురించాయి. కానీ, రెండో రోజు నుంచి ఆ పత్రికలో స్టాండ్ మార్చాయ్.

పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడినా తమకు అనుకూలంగా మాత్రమే రాస్తామని, జగన్ పై వేషం పెంచేలా వ్యవహరిస్తామన్నట్టుగా కథనాలు రాశాయి. అదే సమయంలో మందకృష్ణ వంటి నేతల ద్వారా ఘాటైన విమర్శలు చేయించారు. అంటే దీనిని బట్టి కూటమి ఉండండి.. అంతేకానీ నీ ఇష్టం వచ్చినట్లు కూటమి ఉండదు అనే పరోక్ష హెచ్చరికలను రెండు రోజుల చర్యలను బట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కు తెలియజేశారని పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఇదే వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇది పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు నాయుడు నేర్పిన గుణపాఠంగా పలువురు పేర్కొంటున్నారు.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories