Top Stories

టీవీ5 మూర్తి బయటపడ్డాడు

రెండు తెలుగు రాష్ట్రాల్లో మీడియా తన పరిధికి మించి వ్యవహరిస్తుంటుంది. ముఖ్యంగా ప్రభుత్వాలను ఎవరు ఏర్పాటు చేయాలనే విషయాన్ని తామే నిర్ణయించే స్థాయిలో ఉన్నామనే భావనను కొన్ని మీడియా సంస్థలు కలిగి ఉన్నాయి. తమకు అనుకూలంగా లేని ప్రభుత్వాలపై దుమ్మెత్తి పోయడం, తమకు అండగా ఉండే పార్టీలకు కొమ్ము కాయడం మీడియా సంస్థలకు అలవాటుగా మారిపోయింది. ఎల్లో మీడియాగా పేరుగాంచిన కొన్ని పత్రికలు, చానల్స్ కు చంద్రబాబు నాయుడు, ఆయన సారధ్యంలోని పార్టీలు మాత్రమే అధికారంలో ఉండాలి. ఇందుకోసం ఏం చేయడానికి అయినా సదరు మీడియా సంస్థలు వెనుకాడవు.

పొరపాటున తమకు అనుకూలంగా లేని ప్రభుత్వాలు ఏర్పాటు అయితే ఉదయం లేచిన దగ్గర్నుంచి ఆ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకుంటాయి ఈ మీడియా సంస్థలు. ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు కూడా తెలుసు. ఇదే విషయాన్ని తాజాగా ఎల్లో మీడియా సంస్థల్లో పనిచేసే ఒక సీనియర్ జర్నలిస్ట్ స్వయంగా వెల్లడించాడు. ఆయనే మూర్తి. టీవీ5 పూర్తిగా ప్రస్తుతం ఆయన పేరు అందరికీ సుపరిచితమే. ఒక యువతని ఇంటర్వ్యూ చేస్తున్న క్రమంలో మూర్తి మాట్లాడుతూ.. చదువుకునే రోజుల్లో ఉన్న ఆవేశంతోనే ఇప్పటికీ మాట్లాడుతున్నావని, అసలు మన ఛానల్ కు ఆదాయంలో మేజర్ షేర్ ప్రభుత్వ ఆడ్స్ అని మూర్తి పేర్కొన్నాడు.

వారికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే యాడ్స్ ఇవ్వరని, నువ్వు అనుకున్నట్టే చేద్దువు గాని.. ప్రస్తుతానికి ఈ పొలిటికల్ న్యూస్ పర్సనల్ పెట్టి ఈ క్రైమ్ న్యూస్ చూడమ్మా అంటూ సదరు యువతకి మూర్తి సూచిస్తాడు. ఈ వీడియోను చూసిన ఎంతో మంది టీవీ5 మూర్తి అసలు విషయాన్నీ చెప్పకనే చెప్పేశాడు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు కోసం ఏం చేయడానికైనా ఈ మీడియా వాళ్ళు వెనుకాడరు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories