ఈనాడు మీద కూడా కేసులు పెట్టాలి!

అప్పుడెప్పుడో వైసీపీ హయాంలో రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమా తీశాడు. ఆ టైంలో కొన్ని మీమ్స్, ట్రోల్స్ చేశారు. ఇలాంటివి సోషల్ మీడియాలో చాలా కామన్. ఎందుకంటే ఒక లక్ష మంది వరకూ చేస్తారు. వర్మపై కూడా ఎన్నో వేల మీమ్స్, ట్రోల్స్ వచ్చినా ఆయన నవ్వుకొని ఊరుకున్నారు తప్పితే కేసులు పెట్టిన దాఖలాలు లేవు.

అయితే ఇప్పుడు అధికారం మారడంతో చంద్రబాబు సర్కార్ పగ, ప్రతీకారాలతో రగిలిపోతోంది. వర్మ ఎప్పుడో ఏడాది క్రితం చేసిన మీమ్స్, ట్రోల్స్ పై ఏపీ వ్యాప్తంగా కేసులు పెట్టించి అరెస్ట్ లకు సిద్ధమవుతోంది.

అయితే వర్మ మాత్రం వీటికి భయపడకుండా వివిధ టీవీ చానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ప్రత్యర్థులకు కౌంటర్ ఇస్తున్నారు. నేను చేసింది నేరం అయితే ఈనాడు కూడా చేస్తోంది నేరమేనని.. ఎన్టీఆర్ వెన్నుపోటు పొడిచినప్పుడు ఇందిరాగాంధీ, నాదెండ్ల భాస్కర్ రావు కలిసి చేసిన కుట్ర అని ఈనాడు కార్టూన్లు వేసిందని.. అలాంటివి రోజూ వేస్తున్న ఈనాడు మీద ముందు కేసు పెట్టాలని రాంగోపాల్ వర్మ లాజిక్ బయటపెట్టారు. ఇప్పుడది వైరల్ అవుతోంది.