జగన్ ను హీరోను చేసింది చంద్రబాబే

పట్టుమని 11 సీట్లు వచ్చిన జగన్ నిజానికి కనీసం రెండేళ్ల వరకూ బయటకు రారు అనుకున్నారు. కానీ ఆయన్ను బయటకు తీసుకొచ్చిన ఘనత మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు, కూటమి సర్కార్ దే. ఎన్నో అలివి కానీ హామీలిచ్చి.. ‘నీకు రూ.15వేలు, నీకు రూ.18వేలు అంటూ మాయమాటలు చెప్పి గెలిచిన చంద్రబాబు ప్రభుత్వం గెలిచాక మాట మార్చేసింది. అసలు ఖజానా ఖాళీ అని హామీలు అమలు చేయమని నాలుక మడతెట్టేసింది.

దీంతో ప్రజలు ఆగ్రహించారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి చేయకుండా దాడులు, హత్యలు చోటు చేసుకుండడంతో ప్రజల తరుఫున జగన్ బయటకు రావాల్సిన ఉద్రిక్త పరిస్థితులను ఇదే కూటమి సర్కార్ సృష్టించింది.

దీంతో విధిలేని పరిస్థితుల్లో జగన్ తన తరుఫున నిలబడ్డ వారి కోసం ప్రజల్లోకి వచ్చాడు. కేవలం ఆరునెలలు తిరగకముందే జగన్ జనంలోకి రావడం.. ఆయనకు విశేష మద్దతు దక్కుతుండడంతో కూటమి సర్కార్ జీర్ణించుకోలేకపోతోంది.

నిజంగా జగన్ ను హీరోను చేసింది చంద్రబాబే. ఈ విషయంలో ఆయన వైఫల్యాలే జగన్ కు ఊపిరి పోశాయి. ప్రతిపక్ష నేతగా బలంగా మార్చాయి. ఇప్పుడు అవే కూటమి సర్కార్ కు శరాఘాతంగా మారాయి.