ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప మేనియా కనిపిస్తోంది. పుష్ప 2 రిలీజ్ అయ్యి ఘనవిజయం అందుకుంది. బన్నీ ఫ్యాన్స్, అందులో జగన్ ఫ్యాన్స్ ఇప్పుడు కోలాహలం చేస్తున్నారు.
అనంతపురం జగన్ డైహార్ట్ ఫ్యాన్స్ బన్నీని ఓన్ చేసుకున్నారు. థియేటర్స్ వద్ద అల్లు అర్జున్-జగన్ ఫొటోలను పెట్టుకొని ర్యాలీలు తీయడం.. థియేటర్ వద్ద సంబరాలు చేసుకోవడం కనిపించింది.
ఇది రా మాస్ ఎంట్రీ అంటూ ఫ్యాన్స్ బన్నీ-జగన్ ఫ్యాన్స్ తో వీధుల్లో ర్యాలీలు తీస్తున్నారు. తగ్గేదేలే అంటూ సందడి చేస్తున్నారు.
మెజార్టీ ఏపీ లోని ప్రాంతాల్లో వైసీపీ అభిమానులు బన్నీని తమవాడుగా చూసుకుంటున్నారు. గత ఎన్నికల వేళ బన్నీ వైసీపీ అభ్యర్థి తరుఫున ప్రచారం చేయడంతో అప్పటి నుంచి ఆయనను ఓన్ చేసుకుంటున్నారు. మా కోసం నువ్వు వచ్చావని.. నీ కోసం మేము వస్తాం అంటూ బన్నీ పష్ప సినిమాకు వైసీపీ అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి చూస్తున్నారు. ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ వేళ బన్నీ జగన్ ఫొటోలతో థియేటర్ల వద్ద సందడి మామూలుగా లేదు.