పుష్ప2పై ‘పవర్ రేంజర్’ ఫస్ట్రేషన్

Pushpa 2 Pawan Kalyan : పవర్ రేంజర్ వచ్చేశాడు. మరోసారి పవన్ పై పడిపోయాడు. ఈ గోదావరి యాస కుర్రాడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై నిలదీస్తున్నాడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీరును ఎండగడుతున్నాడు. ప్రతీసారి ఓ వీడియో పెట్టి సునిశితంగా విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజాగా ‘పవర్ రేంజర్’ను అంటూ బయటకొచ్చాడు. ‘అందరికీ నమస్కారం అండీ.. నేనండీ పవర్ రేంజర్ ను ’ అంటూ జనాల్లోకి వచ్చాను. మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సదర్ పవర్ రేంజర్ గట్టిగానే వాయించేసాడు.

‘అయ్య బాబోయ్ అన్ని థియేటర్లలో ఐకాన్ స్టార్ అరాచకం అంట కదా.. ఇప్పుడు రివ్యూ చూసి తట్టుకోలేకపోతున్నానండీ.. బొమ్మ బ్లాక్ బస్టర్ అన్నాక బాస్ కానీ.. బాస్ బ్రదర్స్ కానీ.. బాస్ బేబీలు కానీ ఆపలేరు కదా.. అప్పటికి చెబుతూనే ఉన్నా కూలీలకు.. ఓరిబాబు అది ఆల్ రెడీ హిట్టయ్యే సినిమా మీరు హడావుడి చేసి హల్వా గాళ్లు కాకండి’ అంటూ పవన్ తన మనసులోని మాటను ఇలా చెప్పారంటూ ఆ యువకుడు విమర్శలు గుప్పించాడు.

ఏపీలో ప్రమోషన్ చేయడానికి పుష్పకు అడ్డంకులు కల్పించారని.. చివరి నిమిషంలో టికెట్లు రేట్లు పెంచారని కొన్ని విమర్శలు వచ్చాయి. అయితే సినిమా విడుదలకు కొద్ది ముందు టికెట్లు రేట్లు పెంచడంతో చంద్రబాబు, పవన్ కు అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా థాంక్స్ చెప్పారు. అయితే పుష్పను జనసేన ఎమ్మెల్యేలు, జనసైనికులు క్షేత్రస్థాయిలో వ్యతిరేకించడం.. బన్నీపై విమర్శలు చేయడంతో జనసేనకు ఇది నచ్చలేదన్న ప్రచారం జరిగింది. దాన్నే ఈ గోదావరి యువకుడు తనదైన శైలిలో వీడియోలో సెటైర్లు వేశారు. ఆ వీడియోను మీరు కింద చూడొచ్చు.

*వీడియో కోసం  దీనిమీద క్లిక్ చేయండి*