ప్రజలు తిరుగబడుతారు.. పవన్ సంచలనం

ఏపీలో ఇవ్వడానికి జీతాలు లేవని.. ఖజానా ఖాళీ అని.. సమస్యలు తీర్చాలని ప్రజలంతా పార్టీ ఆఫీసుల ముందుకు వస్తున్నారని.. ఇలానే పాలిస్తే ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో నెలలో మొదటి తేదీన జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, ఇప్పుడు పెన్షనర్లకూ మొదటి తేదీనే పెన్షన్ ఇవ్వగలుగుతున్నామని చెప్పారు. తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టప్రకారం శిక్షించాల్సిందేనని, ఆ విషయంలో కలెక్టర్లు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. పాలనలో వేగం పెరిగితేనే ప్రజలకు వేగంగా సేవలు అందుతాయి. అప్పుడే పెట్టుబడులు కూడా వస్తాయని, పెట్టుబడుల కోసం పొరుగు రాష్ట్రాలతో పోటీ పడినట్టే జిల్లాల మధ్య కలెక్టర్లు కూడా పోటీ పడాలన్నారు. అభివృద్ధితో సంపద వస్తుంది సంపదతో మళ్లీ అభివృద్ధి సాధ్యం అవుతుందని, ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు.

పవన్ కళ్యాణ్ ఏకంగా తమ ప్రభుత్వం అచేతనాన్ని అసహాయతను బయటపెట్టడం సంచలనంగా మారింది. ప్రజలకు ఏమీ ఇవ్వలేకపోతున్నామన్న ఆవేదన ఆగ్రహం ఆయన కళ్లలో ఉంది. అందుకే అలా ఆవేదనతో కూడిన మాటలు మాట్లాడాడు.

ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ కు అసలు ఏపీ పరిస్థితి అర్థమైందని.. మోసపూరిత హామీలు ఇచ్చి గెలిచామని తెలుసుకున్నారని.. ప్రజలు ఇవన్నీ గ్రహించి కూటమి ప్రభుత్వానికి ఎదురు తిరిగే రోజులు తొందరలోనే ఉన్నాయని అర్థమవుతోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి