బాబు గారు ఏమన్నా అంటే చాలు టీడీపీ క్రమశిక్షణకు మారు పేరు అంటారు. అసలు మా పార్టీలో కార్యకర్తలు నేతలు పద్ధతి గల వారు అంటారు. వారికి శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తారు. కానీ బాబును, పార్టీ సిద్ధాంతాలను పక్కనపెట్టి ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు.
బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ మద్యం సేవించి చిందులేశాడు. ఫుల్లుగా మద్యం మత్తులో తీన్మార్ డ్యాన్సులతో బీజేపీ నాయకుడి పెదవులపై డ్యాన్స్ చేసి ముద్దు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
ఈ నెల 10వ తేదీన పాండురంగాపురంలోని యాగంటి రిసార్ట్ లో మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత బీజేపీ నేత అన్నం సతీష్ ప్రభాకర్ మందు పార్టీ పెట్టారు. ఈ కార్యక్రమంలో సతీష్ అనుచరులు పాల్గొన్నారు. అందరూ తాగి సరదాగా గడిపారు.
ఎమ్మెల్యే చమత్కారాలు చూసిన వారు ఇదేం తాగి ఊగడం అంటూ గుసగుసలాడుతున్నారు. వీడియో చూసిన జనాలు మద్యం మత్తులో ఉన్నారని, ఆయన డ్యాన్సులు, బుగ్గలపై ముద్దులు పెట్టుకోవడం ఏంటని విమర్శిస్తున్నారు.. మొత్తానికి టీడీపీ ఎమ్మెల్యే, బీజేపీ మాజీ ఎమ్మెల్సీ కైపుగొల సోషల్ మీడియా ట్రెండింగ్ గా మారింది.