రేపు వైఎస్ జగన్ బర్త్ డే.. సీఎం చంద్రబాబుకు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం కూడా జనం, అభిమానులు ఇంతగా పరితపించడం లేదు. కానీ జగనన్న కోసం ఈరోజు నుంచి సంబరాలు మొదలుపెట్టారు. ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా జగన్ ఫ్లెక్సీలు, జెండాలు చేతబట్టి ఊరు వాడా పాతుతూ సందడి చేస్తున్నారు.
జగన్ బర్త్ డే ఒక పండుగలా జనం సెలబ్రెట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఎక్కడ చూసినా జగన్ పోస్టర్లే. ఈ సందడిని టీడీపీ నేతలు, ప్రజా ప్రతినిధులు తట్టుకోలేకపోతున్నారు. టీడీపీ నేతలకు జగన్ ఫొటోలు చూసినా జడుసుకుంటున్నారు.
వైయస్ జగన్ గారి పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిలో వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, అభిమానులు కట్టిన ఫ్లెక్సీలను తొలగిస్తున్న తాడేపల్లి పురపాలక సంఘం సిబ్బంది.. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు తొలగిస్తున్నామని చెప్తున్న సిబ్బంది తీరుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు..
మరీ ఇంత దిగజారుడు రాజకీయాలా.? వైయస్ జగన్ గారి ఫ్లెక్సీలు చూసినా భయమేనా చంద్రబాబూ? అంటూ నిలదీస్తున్నారు. జగన్ క్రేజ్ జనాల్లో ఎంత ఉందో ఈ వీడియో తెలియజేస్తోంది. వైసీపీ అభిమానులను ఆ ఫ్లెక్సీలు, జెండాలు తీసేయాలంటూ అధికారులు, సిబ్బంది వేడుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జగన్ బర్త్ డే అంటే అంట్లుటది మరీ అంటూ వైసీపీ శ్రేణులు తొడగొడుతూ సంబరంగా జరుపుకుంటున్నారు.