Top Stories

కమలాసన్! వాహ్ అన్నా.. వాహ్!

ఎన్నికల ముందర వైఎస్ జగన్ పాలనలో ఇదే పవన్ కళ్యాణ్ సభలు, సమావేశాల్లో ఎలా ఊగిపోయారో మనం అందరం చూశాం.. ఆవేశపు డైలాగులు.. మీసం మెలేయడాలు.. గొంతు చించుకొని అరవడాలు.. తొడగొట్టడాలు.. నడిరోడ్డు మీద సైతం ఊగిపోయేవాడు. అలాంటి పవన్ కళ్యాన్ ఇప్పుడు అధికారంలోకి రాగానే మారిపోయాడు.

నాటి పవన్ కళ్యాన్ యేనా? అన్నంత మారిపోయాడు. ఎంతలా అంటే ‘నాడు ఊగిపోయిన పవన్.. నేడు ఊగకుండా అసలు వాస్తవంలోకి వచ్చాడు. తనను ఊగిపోయేలా చేసిన జనానికే హితబోధ చేస్తున్నాడు. ఇటీవలే ప్రజలు తిడుతున్నారు.. అంటూ వాపోయిన పవన్ కళ్యాణ్.. జగన్ పాలనలో జరిగిన అత్యాచారాలకు కారణం ప్రభుత్వం అని.. తమ పాలనలో జరిగితే మాత్రం అది కొందరు దుర్మార్గులు చేసిన పాడుపడి అంటూ వెనకేసుకొచ్చాడు. దీంతో సోషల్ మీడియాలో పవన్ తీరుపై సెటైర్లు పడుతున్నాయి.

తాజాగా విశాఖ మన్యంలో రోడ్డు వేయించిన పవన్ అక్కడ పర్యటిస్తూ.. తనను సినిమా హీరోలా అది చేయవద్దు ఇది చేయవద్దు అంటూ ప్రజలకే క్లాస్ పీకాడు. అభిమానులకు చురకలు పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ‘‘నన్ను పని చేసుకోనివ్వండి.. నేను బయటికొస్తే నా మీద పడిపోతే నేను ఏ పని చేయలేను. OG OG అని అరిస్తే పనులు జరగవు.. సీఎం సీఎం అంటారు, డిప్యూటీ సీఎం అయ్యాను కదా.. సినిమాల మోజులో పడి హీరోలకు జేజేలు కొట్టి మీ జీవితంలో బాధ్యతలు మర్చిపోతున్నారు. మాట్లాడితే మీసం తిప్పు, మీసం తిప్పు అంటారు.. నేను మీసం తిప్పితేనో, ఛాతిలు కొట్టుకుంటేనో పనులు జరగవు’ అంటూ ఇప్పుడు అసలు వాస్తవంలోకి వచ్చాడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

జగన్ పాలనలో రెచ్చిపోయిన రచ్చ చేసిన పవన్.. ఇప్పుడు వాస్తవంలో మాత్రం పనులు మెల్లగా జరుగుతాయని సహకరించాలని చెప్పడం కొసమెరుపు.. దీంతో ‘కమలాసన్..’ అంటూ పవన్ వీడియోను నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి నెలకొంది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

‘బిగ్ బాస్ 9’ లోకి దండుపాళ్యం మూవీ హీరోయిన్..

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈసారి భారీ అంచనాలతో మొదలుకానుంది....

మర్యాద మనీష్ కాదు.. అమర్యాద మనీష్!

  జియో హాట్ స్టార్ లో ప్రసారం అవుతున్న ‘అగ్నిపరీక్ష’ రియాలిటీ షో...

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ లో దమ్ము చూపించిన శ్రీజ

  బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 9 సీజన్‌కు ముందు...

సీటు కోసం మగాడిని కొట్టిన మహిళ

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) బస్సులో సీటు కోసం...

Topics

‘బిగ్ బాస్ 9’ లోకి దండుపాళ్యం మూవీ హీరోయిన్..

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈసారి భారీ అంచనాలతో మొదలుకానుంది....

మర్యాద మనీష్ కాదు.. అమర్యాద మనీష్!

  జియో హాట్ స్టార్ లో ప్రసారం అవుతున్న ‘అగ్నిపరీక్ష’ రియాలిటీ షో...

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ లో దమ్ము చూపించిన శ్రీజ

  బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 9 సీజన్‌కు ముందు...

సీటు కోసం మగాడిని కొట్టిన మహిళ

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) బస్సులో సీటు కోసం...

ఏయ్.. నవ్వకండే

  టీవీ5 చానెల్‌లో సీనియర్ యాంకర్‌గా ఉన్న సాంబశివరావు మరోసారి సోషల్ మీడియాలో...

మనిషివా.. మహా వంశీవా?

  మహా టీవీ యాంకర్ వంశీ మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో...

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

Related Articles

Popular Categories