వైఎస్ జగన్ బర్త్ డే సందర్భంగా ట్విట్టర్ మొత్తం హోరెత్తిపోతోంది. ఎక్కడ చూసినా జగన్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలే.. ఆయనకు విషెస్ చెబుతూ.. దాన్ని ఒక పండుగలా చేస్తున్నారు. ట్విట్టర్ లో టాప్ 1 ట్రెండింగ్ గా జగన్ బర్త్ డే ఉందంటే అతిశయోక్తి కాదు..
అంత ట్రెండింగ్ వేళ ట్విట్టర్ లో ఓ వీడియో వైరల్ అవుతోంది. అస్సలు రాజకీయాల్లో బద్ద శత్రువులుగా ఉంటున్న పవన్ కళ్యాణ్, జగన్ లు ఫోన్ లో పలకరించుకుంటే ఇదే పవన్ ఏకంగా జగన్ కు బర్త్ డే శుభాకాంక్షలు చెబితే ఎలా ఉంటుందో కొందరు మార్ఫింగ్ వీడియోలు రూపొందించి వదిలారు. అదే ఇప్పుడు వైరల్ అవుతోంది.
జగన్ బర్త్ డేను పురస్కరించుకొని పవన్ కళ్యాణ్ ఏకంగా కాల్ చేసి జగన్ కు బర్త్ డే విషెస్ చెప్పినట్టుగా వీడియోలో ఉంది. ఇదే విషయాన్ని చంద్రబాబు చెవిలో వేయడం.. అనంతరం జగన్, పవన్ ఫన్నీ మాటల కన్వర్జేషన్ వీడియో వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూస్తే అదిరిపోతోంది.. ‘ఎవడ్రా ఇంత బాగా చేసింది’ అంటూ అందరూ కామెంట్ చేస్తున్నారు.