కలసి ఉంటే సంతోషం అని పెద్దలు ఊరికే అనలేదు. నాడు పులివెందులులో వైఎస్ఆర్ తన తమ్ముడు, బావమరిది కుటుంబాన్ని ఏకం చేసి అన్ని పదవులు ఇచ్చి ప్రభుత్వంలో భాగస్వాములను చేశారు. కుటుంబాన్ని కలిపి వైఎస్ఆర్ ఒక విజయవంతమైన నాయకుడు అయ్యాడు. ఇప్పుడు వై.ఎస్. జగన్ తన తండ్రి బాటలోనే నడుస్తూ తల్లితో పాటు కుటుంబాన్ని కూడా కలిపారు.. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని అందరూ కలిసి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
వైఎస్ ఆర్ నుంచే కుటుంబం అంతా క్రిస్టియానిటీని స్వీకరించి ఫాలో అవుతున్నారు. అందుకే ఈ క్రిస్మస్ పండుగను కుటుంబమంతా ఘనంగా ప్రతీ సంవత్సరం జరుపుకుంటోంది.. తాజాగా వైఎస్ జగన్ ఇంట్లో ఈ వేడుక కు అందరు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో తనతో విభేదించి చెల్లి షర్మిలకు మద్దతుగా ఉన్న విజయమ్మ కూడా ఈ వేడుకలో కొడుకు జగన్ తో కలిసి పాలుపంచుకోవడం.. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడపడం వైరల్ అయ్యింది.
ఒక్క చెల్లి షర్మిల తప్ప కుటుంబమంతా ఈ వేడుకకు హాజరయ్యారు. అందరినీ ఈ క్రిస్మిస్ ఏకం చేసింది.. జగన్ ఇంట కుటుంబమంతా నిజమైన పండుగను చేసుకుంటున్నారు. ఫ్యామిలీని కలిపిన క్రిస్మస్ పండుగను… ఏకం చేసిన జగన్ ఫొటోలను చూసి వైసీపీ శ్రేణులంతా ఆనందపడుతున్నారు. ఆ ఫొటోలను వైరల్ చేస్తున్నారు.