జనాభిమానంలో తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ సాటిరారు మన వైఎస్ జగన్. అవును ఏ నేతకు లేని ఫ్యాన్ బేస్ మన జగన్ కు ఉంది. ఆయన అంటే ప్రాణమిచ్చే నేతలు ఉన్నారు. ఆయన కోసం ఏమైనా చేసే కార్యకర్తలు ఉన్నారు. నేడు పులివెందులలోని చర్చికి వచ్చిన జగన్ కోసం ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. ఆయన్ను చూడడానికి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా చర్చి వద్ద బారులు తీరారు. ఈ సీన్ చూస్తే ఇంద్ర సినిమా రిపీట్ అయినట్టు ఉంది.
ఇంద్ర మూవీలో వర్షం సీన్ లో చిరంజీవికి మద్దతుగా జనాలు వర్షంలో గంతులేసే సీన్ అచ్చం ఇప్పుడు పులివెందులలో జగన్ వచ్చినప్పుడు చర్చి వద్ద రిపీట్ అయ్యింది. ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో రిలీజ్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది.
జగన్ అంటే పడిచచ్చే జనాన్ని కంట్రోల్ చేయలేకపోయారు పోలీసులు.. బోరున వర్షం పడుతున్నా లెక్కచేయకుండా జగన్ జగన్ అంటూ కేరింతలు కొట్టారు.
జగన్ కు జనాభిమానం ఎంతో ఉందో ఈ ఒక్క వీడియో నిరూపిస్తోంది. జగన్ అంటే అట్లుంటదీ మరీ అని కామెంట్స్ చేస్తున్నారు.