జగన్ పై రచ్చ.. రేవంత్ పై సైలెన్స్.. ఇదేనా ఇండస్ట్రీ

జగన్ సీఎంగా ఉన్న రోజుల్లో జగన్ ఎంతో మర్యాద ఇచ్చినా టాలీవుడ్ పెద్దలు నిలుపుకోలేదు. చిరంజీవి చేతులు కట్టుకొని అడిగాడని పవన్ కళ్యాణ్ రచ్చ చేశాడు. టాలీవుడ్ పెద్దలు జగన్ సర్కార్ ను టార్గెట్ చేసి ప్రజల్లో పలుచన చేశారు.. కట్ చేస్తే..

జగన్ ను మించి రేవంత్ రెడ్డి టాలీవుడ్ ను పగబట్టాడు. తన వద్దకు టాలీవుడ్ పెద్దలు అంతా వచ్చినా తగ్గలేదు. అసెంబ్లీలో చేసిన ప్రకటనకే కట్టుబడ్డాడు. ఇక నుంచి తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవని.. టికెట్ల రేట్ల పెంపు ఉండదంటూ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టాలీవుడ్ పెద్దల రాజీ డ్రామాకు షాకిచ్చారు.

దీంతో బయటకొచ్చిన దిల్ రాజు సహా టాలీవుడ్ పెద్దలంతా తాము సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపునకు కోసం కాదని.. కేవలం టాలీవుడ్ ను అంతర్జాతీయ స్తాయికి తీసుకెళ్లే ప్రణాళికలో భాగమంటూ మాట మార్చి సర్దిచెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇదే జగన్ చేస్తే నానా యాగీ చేసిన పెద్దలు ఇప్పుడు రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్ కు నోటి నుంచి మాట రాని పరిస్థితి. ఆనాడు గొంతెత్తిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు నోరు తెరవడం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి