జగన్ పై ఫైర్.. రేవంత్ పై ఫ్లవర్.. పవన్ వైరల్ వీడియో

జగన్ పై లేచిన పవన్ కళ్యాన్ నోరు.. ఇప్పుడు అదే పనిచేసిన రేవంత్ రెడ్డిపై లేవడం లేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంత నిర్మహమాటంగా టాలీవుడ్ పెద్దలను ఓ ఆట ఆడుకుంటుంటే.. ఇండస్ట్రీకి పెద్దదిక్కు.. ఏకంగా ఏపీలో అధికారంలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట దాటేయడం సంచలనంగా మారింది.

టాలీవుడ్ పెద్దలతో ఇటీవల రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరుపై విమర్శలు వచ్చాయి. గంట పాటు టాలీవుడ్ ప్రముఖులను వెయిట్ చేయించడం.. వారి ఏ హామీలకు ఓకే చెప్పకపోవడంతో నిట్టూర్చారు. ఇదే విషయంలో గతంలో జగన్ పై ఇదే పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు టికెట్ల రేట్లు నిర్ణయించడానికి జగన్ ఎవరు.. ఆయన ముందు అందరు చేతులు కట్టుకోవాలా అని విమర్శించాడు.

ఇప్పుడు కర్నూలు పర్యటనకు వచ్చినప్పుడు అల్లు అర్జున్ ఇన్సిడెంట్ మీద మీరు ఏమంటారు సార్ అని విలేకరులు అడిగితే దాట వేశాడు. మనుషులు చనిపోతుంటే ఇప్పుడు సినిమాల మీద అడుగతారు ఏంటి అని ఎదురుప్రశ్నించాడు.

జగన్ సీఎంగా ఉన్నప్పుడు లేచిన పవన్ నోరు ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి మీద కామెంట్ చేయడానికి భయపడుతోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి

 

Share