వాహ్.. బాబు వాహ్.. బురదలో పోస్తున్న కూటమి ప్రభుత్వం

వాన వస్తే ఏమవుతుంది.. వరద అవుతుంది.. ఆ వరద అంతా పల్లపు ప్రాంతాల్లో చేరుతుంది. ఇప్పడు మొన్నటి వర్షాలకు అమరావతి మునిగింది. ఎక్కడ చూసినా చెరువులను తలపిస్తోంది. ఇప్పటికే గత ప్రభుత్వంలో పునాదులు తవ్వి తీసిన చంద్రబాబు ఇప్పుడు వాటిల్లో నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్నారు.

దీంతో చెరువులను ఖాళీ చేయాలి.. చేయాలంటే కరెంట్ కావాలి.. ఏపీలో కరెంట్ కోతలు.. దీంతో ప్రభుత్వ సొమ్ముతో ప్రైవేటు ట్రాక్టర్లను తీసుకొచ్చి అమరావతిలో మునిగిన ప్రాంతాల్లో నీటీని ఎత్తిపోస్తున్నారు. అవును.. ఇప్పుడు అమరావతిలో మునిగిన నీటిని ఎత్తిపోసేందుకు ప్రభుత్వ సొమ్మును వాడేస్తున్నారు.

మొన్న భారీ వర్షాలకు అమరావతి గ్రామాలు పూర్తిగా మునిగిపోయిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఆ వరద నీరు తోడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన వీడియోలు బయటకు వచ్చాయి. . ప్రజల సొమ్మును బురదలో పోస్తున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి