Top Stories

అల్లు అర్జున్ ను టార్గెట్ చేసి హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారా

నిజం గడపదాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టి వస్తుందన్నది నానుడి. అల్లు అర్జున్ కి సంబంధించిన కేసులోనూ అదే జరిగింది. సంధ్యా థియేటర్ ఘటనపై ఆయన పాత్ర గురించి అర్థసత్యాలు, అసత్యాలే ఎక్కువగా ప్రచారం సాగాయి. అసలు వాస్తవాలు ఇప్పుడు క్రమంగా బయటపడుతున్నాయి. ఒక్కొక్కరుగా గొంతు విప్పే పరిస్థితి వస్తుంది. అందులో టాలీవుడ్ ప్రముఖుల నుంచి బాలీవుడ్ సెలబ్రిటీల వరకూ స్వరం పెంచుతున్నారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ కూడా స్పందించారు. అల్లు అర్జున్ ను ఏకపక్షంగా నిందించడం తగదంటూ వ్యాఖ్యానించారు. ఆయనే దోషి అన్నట్టుగా చిత్రీకరించడం తగదన్నారు. ఒక వ్యక్తికి ఆపాదించే ప్రయత్నం సరికాదన్నారు. అదే సమయంలో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కూడా అదే రీతిలో వ్యాఖ్యానించారు. సినిమా అంటే హీరోకే సంబంధం అన్నట్టుగా ప్రత్యక్ష ప్రమేయం లేని ఘటనలో అల్లు అర్జున్ ను వేధించారన్నట్టుగా మాట్లాడారు.

తాజాగా ఎన్ హెచ్ ఆర్ సీ కూడా కదిలింది. తెలంగాణా డీజీపీ, సిటీ కమిషనర్ కు నోటీసులు జారీ చేసింది. పోలీసుల వైఫల్యాన్ని ప్రశ్నించింది. లాఠీఛార్జ్ చేసిన తీరు మీద ఆగ్రహించింది. నోటీసులకు నాలుగు వారాల్లో సమాధానలు ఇవ్వాలని ఆదేశింది. దాంతో పోలీసు భద్రతా వైపల్యం బయటపడే అవకాశం ఉంది. సీనియర్ అడ్వకేట్ పిటీషన్ తో ఎన్ హెచ్ ఆర్ సీ జారీ చేసిన నోటీసుల అంశం పోలీసుల మెడకు చుట్టుకునే అవకాశం ఉంది.

ఇప్పటి వరకూ అల్లు అర్జున్ ను బద్నాం చేస్తూ సాగించిన ప్రచారానికి ఈ పరిణామాలు ఫుల్ స్టాప్ పెడుతున్నాయి. అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కానీ అదే సమయంలో ఇంటర్నేషనల్ గా ఎంటర్టైన్మెంట్ క్యాపిటల్ గా ఎదిగే ప్రయత్నంలో ఉన్న హైదరాబాద్ ఇమేజ్ కి ఇవన్నీ చేటు తెస్తాయనే వాదన బలపడుతోంది. సినిమా ఇండస్ట్రీకి హబ్ మారబోతున్న నగరంలో ఓ సెలబ్రిటీ మీద అతిగా ఫోకస్ చేసి మొత్తం నగరానికి చెడ్డపేరు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టుగా భావిస్తున్నారు. అల్లు అర్జున్ ప్రత్యక్షంగా ప్రమేయం లేకపోయినా కేసుని ఆయన మెడకు చుట్టాలన్న యత్నంలో మొత్తం టాలీవుడ్ లోనే అలజడి రాజేసిన తీరుని ప్రస్తావిస్తున్నారు. ఇలాంటి చర్యలు శ్రేయస్కరం కాదని ప్రస్తుత పరిణామాలు తేటతెల్లం చేస్తున్న తరుణంలో యంత్రాంగం తీరు మార్చుకోవాల్సిన అవసరాన్ని చాటుతోంది.

Trending today

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Topics

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

అమరావతి కోసం కదిలిన జగన్..!

అమరావతి అంశంపై గత ఐదేళ్లుగా మౌనంగా ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి...

‘మహా’ వంశీ అమరావతి లొల్లి

అమరావతి రాజధాని పనులపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. అభివృద్ధి ఎక్కడ...

Related Articles

Popular Categories