ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ.. ఆయన సంస్థ ఏబీఎన్ న్యూస్ చానెల్ లో పనిచేసే జర్నలిస్ట్ వెంకటకృష్ణ ఒక్కటే పాట పాడుతున్నారు. మొన్నటి ఆదివారం కొత్త పలుకులో ‘జగన్ ను ఏమీ చేయడం లేదు.. ఎప్పటికైనా బాబుకు ముప్పే.. జగన్ వచ్చేసారి అధికారంలోకి వస్తాడు.. నువ్వు ఏమీ చేయలేకపోతున్నావ్.. కేసులు పెట్టి లోపల వేయించు’ అంటూ రాధాకృష్ణ తన పత్రికలో శోకాలు పెట్టాడు. అయితే చంద్రబాబు మాత్రం జగన్ ను అరెస్ట్ చేస్తే ప్రజాబలంతో మళ్లీ అధికారంలోకి వస్తాడని భయపడుతున్నాడు. అలాగని రాధాకృష్ణ చెప్పినట్టు తల వంచుకొని చేయడానికి సిద్ధం లేడు.
తన మాట వినని చంద్రబాబును టార్గెట్ చేసుకొని ఏబీఎన్, ఆంధ్రజ్యోతిల్లో రాధాకృష్ణ చెలరేగిపోతున్నాడు. తాజాగా ఏబీఎన్ చానెల్ లోనూ ఏబీఎన్ వెంకటకృష్ణ తగులుకున్నాడు. ‘‘11 సీటు వచ్చిన జగన్ తగ్గడం లేదు … కేంద్రంలో అధికారం లో ఉండి , రాష్ట్రం లో అధికారం ఉండి మనం ఏం పీకలేకపోతున్నం ’ అంటూ ABN జర్నలిస్ట్ వెంకటకృష్ణ బోరుమన్నాడు.
తన ఆవేదనతో కూడిన అక్కసును వెళ్లగక్కాడు. చంద్రబాబు తమ మాట వినడం లేదే అన్న ఫస్ట్రేషన్ వెంకటకృష్ణ మోములో కనిపించింది. అందుకే టీడీపీకి వెన్నుదన్నుగా ఉండే ఆంధ్రజ్యోతి మీడియా ఇప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా కథనాలు వండివార్చుతూ రెబల్ గా మారిపోయింది. ఈ పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. వెంటకృష్ణ వీడియో వైరల్ అవుతోంది.