Top Stories

గురువింద రాధాకృష్ణ.. గతాన్ని మరిచావా?

శకునం చెప్పే బల్లి ఎప్పుడూ కుడితిలోనే పడుతుందట. అదే విధంగా, నీతి వ్యాఖ్యలు చేసే వారికి తమ గత విమర్శలు గుర్తుండవన్న మాట తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, తెలుగు మీడియా లోకంలో ప్రఖ్యాత పాత్రికేయుల్లో ఒకరైన వేమూరి రాధాకృష్ణ గురించి.

రాధాకృష్ణ చేసే వ్యాఖ్యలకు, రాసే రాతలకు ఎప్పుడూ స్థిరత ఉండదు. కొన్ని సందర్భాల్లో సత్య హరిచంద్రుడిగా ఉంటే, మరికొన్నిసార్లు రాజకీయ భయోపద్రవాన్ని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తారు. అందుకే ఆయన జర్నలిజాన్ని అంచనా వేయడం చాలా క్లిష్టం.

ప్రతి ఆదివారం, “ఆంధ్రజ్యోతి” పత్రికలో రాధాకృష్ణ తన ప్రత్యేక కాలమ్ ‘కొత్త పలుకు’ ద్వారా దేశ, రాష్ట్ర రాజకీయాలపై తన విశ్లేషణ అందిస్తుంటారు. ఈ వారం కూడా, ఏపీ నుంచి కర్ణాటక వరకు రాజకీయాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని, గ్రీస్ కుప్పకూలిన పరిస్థితిని, వెనిజులా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఉదాహరించడంతో పాటు, ప్రభుత్వాలు ప్రజలకు ఉచిత హామీలు ఇస్తూ పోతే ఆఖరికి ఖజానాలో దిద్దుకునేందుకు రూపాయి కూడా మిగలదని హెచ్చరించారు. ప్రజలు చెల్లించే పన్నులను ఇష్టానుసారంగా ఖర్చు చేయడం ప్రభుత్వాల హక్కేనా? అంటూ మండిపడ్డారు. జర్నలిస్టు కోణంలో రాధాకృష్ణ చేసిన విశ్లేషణ గంభీరంగా అనిపించినా, గతంలో ఆయన తీసుకున్న వైఖరి చూస్తే పరిస్థితి భిన్నంగా ఉంటుంది.

గతం మరచిన రాధాకృష్ణ

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు, టీడీపీ నేతలు ‘సూపర్ సిక్స్’ పేరుతో ప్రజలకు పలు హామీలు ఇచ్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ‘డబ్బులు పంచుకుంటూ ఓట్లు పొందారు’ అంటూ విమర్శించిన రాధాకృష్ణ, టీడీపీ పథకాల విషయంలో మాత్రం పూర్తి మౌనాన్ని పాటించారు. అంతే కాకుండా, తన “ఆంధ్రజ్యోతి” పత్రికలో సూపర్ సిక్స్ పథకాలపై అనుకూల కథనాలు రాయిస్తూ ప్రచారం సాగించారు. నెలల పాటు సాగిన ఈ ప్రచారం వెనుక ఉద్దేశ్యమేమిటి?

ఇప్పుడు, ఇతర పార్టీలు ఉచిత హామీల గురించి మాట్లాడితే మండిపడుతున్న రాధాకృష్ణ, అప్పటి ‘సూపర్ సిక్స్’ వల్ల ప్రభుత్వ ఖజానాకు బొక్క పడుతుందని గుర్తించలేకపోయారా? టీడీపీ హామీలు న్యాయమైనవే అనిపించాయి, కానీ ఇతర పార్టీలు అలా చేస్తే తప్పా? చంద్రబాబుకు ఈ ఆర్థిక లోటు గురించి రాధాకృష్ణ చెప్పలేకపోయాడా? లేదా చెప్పడం మర్చిపోయాడా? పైగా, తన పత్రికలో సూపర్ సిక్స్ పథకాలపై అనుకూల కథనాలు ప్రచురించడం ఎందుకు?

రాధాకృష్ణ పాత్రికేయత  నిజంగా నిష్పక్షపాతమా?

స్వేచ్ఛాయుత పాత్రికేయంగా చెప్పుకునే రాధాకృష్ణ, తన పత్రిక సర్క్యూలేషన్ పెంచుకునేందుకు ‘కారు రేసు’, ‘బంపర్ డ్రా’ వంటి స్కీమ్‌లు ప్రవేశపెట్టారు. ప్రతి నెలా కూపన్లు పబ్లిష్ చేయడం కూడా ఇదే వ్యూహంలో భాగం. కానీ, ఇదీ ఉచితమే కదా? ఇతర పార్టీలు ప్రజలకు ఉచితాలు అందిస్తే విమర్శించే రాధాకృష్ణ, తాను అమలు చేస్తున్న వ్యూహాల గురించి ఆత్మవిమర్శ చేసుకునేలా లేడు.

ఆంధ్రజ్యోతి పత్రిక ఉద్యోగుల జీతాలు నేటికీ అంతంత మాత్రంగానే ఉన్నాయని వార్తలు ఉన్నాయి. స్కీమ్‌లకు వెచ్చించే డబ్బును ఉద్యోగుల సంక్షేమానికి కేటాయిస్తే, వారు మరింత ఉత్సాహంగా పని చేసేవారు. కానీ, కేవలం వ్యాపారం కోసమే జర్నలిజాన్ని ఉపయోగించుకుంటూ, నిజాయితీ లేని ప్రచారం చేస్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం మీడియాను వాడుకునే రాధాకృష్ణ పాత్రికేయత ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైంది.

గురిగింజ తన నలుపు తెలుసుకోదు అని ఒక మాట ఉంది. అదే విధంగా, తాను గతంలో ఏమి రాశారో గుర్తించకుండా, ఇతరులను తప్పుబట్టే రాధాకృష్ణ పాత్రికేయతను సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఇంకా చెప్పుకోవాలంటే చాలా విషయాలున్నాయి, కానీ ఆలోచించడానికి ఇదే సరిపోతుందని భావిస్తూ ఈ చర్చను ఇక్కడితో ముగిస్తున్నాం.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories