Top Stories

విజయసాయిరెడ్డి స్థానంలో ఫైర్ బ్రాండ్

మాజీ సీఎం జగన్ పార్టీ పునర్వ్యవస్థీకరణలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో కొత్త ఉత్సాహం నింపేందుకు ఆయన వ్యూహాత్మక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా తన తండ్రితో కలిసి పని చేసిన అనుభవజ్ఞుల్ని తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా రాజకీయ సమీకరణాలు నిర్వహిస్తున్న జగన్, ఉగాది నుంచి జిల్లాల పర్యటనలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ మార్పుల సమయంలో, పార్టీని వీడుతున్న సీనియర్ నేతల స్థానాలను కీలక నాయకులకు అప్పగించేందుకు జగన్ చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా, విజయసాయిరెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పిన నేపథ్యంలో, ఆయన స్థానాన్ని ఓ కీలక నేత భర్తీ చేయనున్న విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నెంబర్ టూ స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి, 2019 ఎన్నికల అనంతరం ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇంఛార్జ్‌గా వ్యవహరించారు. కానీ, ఆరోపణల నేపథ్యంలో ఆ బాధ్యతల నుంచి తొలగించబడ్డారు.

2024 ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో విజయసాయిరెడ్డికి బాధ్యతలు అప్పగించగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడటంతో ఆయన అనూహ్యంగా నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీకి దిగారు. అయితే, ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. దీంతో జగన్ మరోసారి ఉత్తరాంధ్ర బాధ్యతలను విజయసాయిరెడ్డికి అప్పగించారు.

ఇప్పుడీ కీలక ప్రాంతంలో కొత్త నాయకత్వం అవసరమైన తరుణంలో, జగన్ సీనియర్ నేత బొత్సా సత్యనారాయణతో చర్చలు జరిపినట్లు సమాచారం. చివరకు, ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలను ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన పేర్ని నానికి అప్పగించాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ తరఫున బలమైన స్వరం వినిపిస్తున్న నేతల్లో పేర్ని నాని ఉన్నారు. ఇటీవల బియ్యం వివాదంలోనూ ఆయన కుటుంబం కేసులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

Trending today

ఏడుస్తూ చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు

  టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు తగిన గుర్తింపు రావడం లేదు. మంచి కథాంశంతో...

బిగ్ బాస్ 9 హౌస్ లోకి 18 మంది కంటెస్టెంట్స్ వీరే!

  బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్...

టీవీ5 సాంబను ఇక్కడ వదల్లేదుగా..

  లండన్‌లో నివాసం ఉంటున్న వైసీపీ యూకే వ్యవహారాల ఇన్‌చార్జి డాక్టర్ ప్రదీప్...

కాళేశ్వరంపై కవిత సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళేశ్వర...

DSC.. పోస్టులు అమ్ముకున్నారా?

  ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న DSC-2025 నియామకాలు తీవ్రమైన వివాదాలకు దారితీస్తున్నాయి. కష్టపడి పరీక్షలు...

Topics

ఏడుస్తూ చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు

  టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు తగిన గుర్తింపు రావడం లేదు. మంచి కథాంశంతో...

బిగ్ బాస్ 9 హౌస్ లోకి 18 మంది కంటెస్టెంట్స్ వీరే!

  బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్...

టీవీ5 సాంబను ఇక్కడ వదల్లేదుగా..

  లండన్‌లో నివాసం ఉంటున్న వైసీపీ యూకే వ్యవహారాల ఇన్‌చార్జి డాక్టర్ ప్రదీప్...

కాళేశ్వరంపై కవిత సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళేశ్వర...

DSC.. పోస్టులు అమ్ముకున్నారా?

  ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న DSC-2025 నియామకాలు తీవ్రమైన వివాదాలకు దారితీస్తున్నాయి. కష్టపడి పరీక్షలు...

‘అగ్ని పరీక్ష’ వెనుక ఉన్న అసలు కారణం ఇదే!

  టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ షో ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ప్రయోగాలతో...

పబ్లిక్ గా దువ్వాడ-దివ్వెల రోమాన్స్.. మీ సరసం సల్లగుండ!

  రాజకీయాల్లో ఒకప్పుడు వైసీపీకి దగ్గరగా ఉన్న బహిష్కృత నేత దువ్వాడ శ్రీనివాస్...

రాజన్న మళ్లీ పుట్టవా?

2009 సెప్టెంబర్ 2న ఆకాశం చీకటిగా మారిన రోజు... తెలుగు రాష్ట్రాల...

Related Articles

Popular Categories