Top Stories

ఎవడా హౌలా గాడు.. చిందులు తొక్కిన మంత్రి.. వైరల్ వీడియో

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కరీంనగర్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియా ప్రతినిధులపై తీవ్రంగా స్పందించారు. “ఎవరయ్యా సెల్‌ఫోన్ మాట్లాడతడు? క్రాక్ ఫెలో.. ఎవడా హౌలా గాడు.. ఎవడయ్యా వాడు?” అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు.

సమావేశంలో పొన్నం ప్రభాకర్ భారత రాష్ట్ర సమితి (BRS), భారతీయ జనతా పార్టీ (BJP)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కులగణనపై ఈ రెండు పార్టీలు చేస్తున్న ఆరోపణలు అన్యాయమని, బలహీన వర్గాలకు న్యాయం చేయగలిగేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. మైనార్టీలను బీసీలలో చేర్చలేదని తెలిపారు. కుల గణన దరఖాస్తులను BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు పంపినట్లు పేర్కొన్నారు.

“కులగణనలో ముందుగా మీరు పాల్గొనండి. ఆ తర్వాత మాట్లాడండి. బలహీన వర్గాలకు న్యాయం జరగడం మీకు ఇష్టం లేదా?” అంటూ ఆయన ప్రశ్నించారు. BRS, BJP నాయకులకు చిత్తశుద్ధి లేదని, చేతకాకపోతే నిశ్శబ్దంగా ఉండాలని సూచించారు. కుల గణనపై BJP నాయకులు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అయినప్పటికీ, వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని తెలిపారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి సవాల్ విసిరిన పొన్నం ప్రభాకర్, “దమ్ముంటే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టేలా కేంద్రాన్ని ఒప్పించండి” అని డిమాండ్ చేశారు. BJP రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను తొలగించడంతో బీసీ సమాజం బాధపడిందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ కవిత గురించి మాట్లాడుతూ, “ఆమె లిక్కర్ కేసుతో నినాదం అయ్యింది. ఇప్పుడు బీసీ నినాదాన్ని ఎత్తుకుంది. కవితకు అప్పుడప్పుడు జాగృతి గుర్తుకు వస్తుంది, లేదంటే బతుకమ్మను నెత్తిపై ఎత్తుకుంటుంది” అని ఎద్దేవా చేశారు. అయితే, ఆమెను విమర్శించాలనే ఉద్దేశం తనకు లేదని, కానీ ఆమె వ్యాఖ్యలు ఇబ్బంది కలిగిస్తున్నాయని వివరించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు న్యాయం జరిగిందని, రాష్ట్ర అధ్యక్ష పదవి సహా అనేక పదవులను బీసీలకు కేటాయించినట్లు చెప్పారు. “ఇతర పార్టీలు అలాంటి న్యాయం చేయగలవా?” అంటూ పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు.

అయితే, ఈ సమావేశంలో పొన్నం ప్రభాకర్ మీడియా ప్రతినిధులపై ఆగ్రహంతో మాట్లాడటం, చిందులు తొక్కడం చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో గులాబీ పార్టీ అనుకూల సోషల్ మీడియా గ్రూపుల్లో వైరల్‌గా మారింది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories