Top Stories

ప్రతీకారం.. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గురువారం ఉదయం సంచలన పరిణామం చోటు చేసుకుంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. తెల్లవారుజామునే వంశీ ఇంటికి చేరుకున్న పోలీసులు, ఇంటిని చుట్టుముట్టి, అరెస్ట్ వారెంట్ చూపించిన తర్వాత ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గన్నవరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ, అనంతరం టీడీపీకి వ్యతిరేకంగా వ్యవహరించడం ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌పై తీవ్ర విమర్శలు చేసిన ఆయన, చివరకు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన తీరు టీడీపీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించింది. ముఖ్యంగా, టీడీపీ కార్యాలయంపై దాడికి ఆయనకు సంబంధం ఉందంటూ ఆరోపణలు వచ్చాయి.

అప్పట్లో జరిగిన దాడిపై టీడీపీ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతోపాటు, గవర్నర్ మరియు డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. అయితే, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో, ఈ ఘటనపై పెద్దగా చర్యలు తీసుకోలేదు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా ధ్వంసం అయ్యిందనే ఆరోపణలు ఉన్నాయి.

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించింది. టీడీపీ నేతలు ఆధారాలను సేకరించి, కేసును పునర్విచారణకు తీసుకురాగానే అరెస్టుల పర్వం ప్రారంభమైంది. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ ముందస్తుగా బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినా, వారికి అనుకూలంగా నిర్ణయం రాలేదు.

గతంలో వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడ్డవారిపై కూటమి ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తోంది. గనుల శాఖ అక్రమాల కేసులో వెంకటరెడ్డి అరెస్టై, బెయిల్‌పై విడుదలయ్యారు. ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్టు కూడా అదే దిశగా కొనసాగుతున్న చర్యగా కనిపిస్తోంది. అయితే, ఇది కేవలం న్యాయపరమైన ప్రక్రియ అని, రాజకీయ కక్ష సాధింపు కాదని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు.

Trending today

‘బిగ్ బాస్ 9’ లోకి దండుపాళ్యం మూవీ హీరోయిన్..

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈసారి భారీ అంచనాలతో మొదలుకానుంది....

మర్యాద మనీష్ కాదు.. అమర్యాద మనీష్!

  జియో హాట్ స్టార్ లో ప్రసారం అవుతున్న ‘అగ్నిపరీక్ష’ రియాలిటీ షో...

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ లో దమ్ము చూపించిన శ్రీజ

  బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 9 సీజన్‌కు ముందు...

సీటు కోసం మగాడిని కొట్టిన మహిళ

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) బస్సులో సీటు కోసం...

Topics

‘బిగ్ బాస్ 9’ లోకి దండుపాళ్యం మూవీ హీరోయిన్..

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈసారి భారీ అంచనాలతో మొదలుకానుంది....

మర్యాద మనీష్ కాదు.. అమర్యాద మనీష్!

  జియో హాట్ స్టార్ లో ప్రసారం అవుతున్న ‘అగ్నిపరీక్ష’ రియాలిటీ షో...

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ లో దమ్ము చూపించిన శ్రీజ

  బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 9 సీజన్‌కు ముందు...

సీటు కోసం మగాడిని కొట్టిన మహిళ

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) బస్సులో సీటు కోసం...

ఏయ్.. నవ్వకండే

  టీవీ5 చానెల్‌లో సీనియర్ యాంకర్‌గా ఉన్న సాంబశివరావు మరోసారి సోషల్ మీడియాలో...

మనిషివా.. మహా వంశీవా?

  మహా టీవీ యాంకర్ వంశీ మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో...

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

Related Articles

Popular Categories