Top Stories

సీఎం చంద్రబాబుపై మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు.. ఫోన్ కాల్ వైరల్

తిరుపతిలో నిన్న అర్ధరాత్రి మంచు మనోజ్ అరెస్టు కావడం పెద్ద సంచలనంగా మారింది. చంద్రగిరిలో జరిగిన జల్లికట్టు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, అనంతరం లేక్ వ్యాలీ రిసార్ట్‌లో బస చేశారు. అయితే, రాత్రి 11 గంటల సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అక్కడికి చేరుకుని, అటవీ ప్రాంతంలో అనుమతి లేకుండా ఉండరాదని, వెంటనే ఖాళీ చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో మంచు మనోజ్, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, చివరికి అతన్ని బకరాపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అయితే, పోలీస్ స్టేషన్‌లో ఉన్నతాధికారులతో మంచు మనోజ్ ఫోన్‌లో మాట్లాడిన సంభాషణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆయన, “మీ పోలీసులు సీఎం చంద్రబాబు గారు అరెస్ట్ చేయమంటే వచ్చి చేశామన్నట్లు మాట్లాడుతున్నారు. సీఎం గారికి వేరే పనేమీ లేదా? ఇలాంటి చిన్న విషయాలకు ఆయన పేరును ఎందుకు వాడుతున్నారు?” అంటూ ప్రశ్నించారు.

అలాగే, “ఇదంతా ఎవరు చేయిస్తున్నారో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక ఎందుకు దాగుడుమూతలు? నేను పోలీస్ జీప్ ఎక్కుతుంటే, మీ ఎస్‌ఐ, ఒక కానిస్టేబుల్ నా చెయ్యి పట్టుకుని లాగారు. నేను ఎలాంటి తప్పూ చేయకపోతే, అలా చేయాల్సిన అవసరం ఏముంది?” అంటూ మనోజ్ తన ఆవేదనను వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై నెటిజన్లు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు భిన్న స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు మంచు మనోజ్‌ను సమర్థించగా, మరికొందరు పోలీసుల విధానాన్ని సమర్థిస్తున్నారు. ఈ వ్యవహారంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

టీడీపీ బాయ్‌కాట్… కానీ అర్నాబ్‌కు మహా వంశీ సన్మానం

లోకేష్‌ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి...

ఏపీ ఆర్థిక ‘సుడిగుండం’పై సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న...

Topics

అమరావతికి షాక్.. పాపం ‘కూటమి’

అమరావతిని చట్టబద్ధ రాజధానిగా స్థిరీకరించాలనే దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. గెజిట్...

పో పోవయ్యా ‘బాబు’

ఎమ్మెల్యేలు మాత్రమే కాదు... ఏకంగా మంత్రులు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

దువ్వాడ మరో సంచలనం

వైసీపీ నుంచి బహిష్కృతుడైన దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలతో మరోసారి సంచలనం...

Related Articles

Popular Categories