వల్లభనేని వంశీ కేసు.. సాయంత్రం 7 గంటలకు బిగ్ బ్లాస్ట్.. వైయస్సార్ కాంగ్రెస్ ట్వీట్ వైరల్!

Vallabhaneni Vamsi Arrest

వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు కీలక విషయాన్ని వెల్లడించనున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. గన్నవరం టిడిపి కార్యాలయం పై దాడి కేసులో కీలక మలుపు తిరగనున్నట్లు తెలుస్తోంది.

వైసీపీ ఆరోపణల ప్రకారం, సత్య వర్ధన్ అనే వ్యక్తిని టిడిపి నేతలు వల్లభనేని వంశీ పై ఫిర్యాదు చేయించారని, అయితే తర్వాత అతను తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారని అంటున్నారు. సత్య వర్ధన్ గన్నవరం టిడిపి కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తుండగా, అతను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈ నేపథ్యంలో, అతని కుటుంబ సభ్యులపై టిడిపి నేతలు ఒత్తిడి పెంచారని, ఇంకా దాడికి పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తోంది.

దీంతో, ఈ ఘటనకు సంబంధించి వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంచలన విషయాలను బయటపెట్టనున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే న్యాయస్థానం గన్నవరం టిడిపి కార్యాలయం పై దాడి కేసులో తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు చర్యలు తీసుకోవద్దని సూచించింది. ఈ పరిణామాల నేపథ్యంలో, కూటమి ప్రభుత్వం తన వ్యూహాన్ని మార్చిందని వైసీపీ అనుమానిస్తోంది.

ఈ వివాదంపై సాయంత్రం ఏడు గంటలకు వైసీపీ వెలువరించనున్న ప్రకటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ విషయంలో మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.