Top Stories

పోసాని కృష్ణమురళి అరెస్టు – సంచలన నిజాలు వెలుగులోకి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉత్కంఠత పెరుగుతోంది. ఎన్నికల సమయం దగ్గరపడకుండానే నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటూ, రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. అధికార కూటమి ప్రభుత్వం అరెస్టుల ప్రక్రియను ప్రారంభించడంతో, ఈ పరిణామాలు మరింత చర్చనీయాంశంగా మారాయి.

ఇటీవల టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు చేసిన ఏపీ పోలీసులు, తాజాగా ప్రముఖ సినీ నటుడు మరియు వైసీపీ అనుకూల నేత పోసాని కృష్ణమురళిని కూడా అదుపులోకి తీసుకున్నారు. టిడిపి నేతలు ఆయనపై చేసిన ఫిర్యాదు మేరకు, ఓబులవారిపల్లె పోలీసులు హైదరాబాద్ వెళ్లి, రాయదుర్గం ప్రాంతంలోని ఆయన ఇంటి వద్ద అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోసాని మరియు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నప్పటికీ, చివరకు ఆయనను ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ కు తరలించి, అక్కడి నుంచి రైల్వే కోడూరు ప్రధాన న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయమూర్తి పోసానిని 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కు ఆదేశించడంతో, ఆయనను కడప సెంట్రల్ జైలుకు తరలించారు.

పోలీసుల ఎదుట సంచలన వ్యాఖ్యలు
పోలీసుల విచారణలో పోసాని కృష్ణమురళి అనేక కీలక విషయాలను బయటపెట్టినట్టు సమాచారం. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై తన గత వ్యాఖ్యల వెనుక వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి హస్తం ఉందని, తన వ్యాఖ్యలను వైరల్ చేయడంలో సజ్జల భార్గవ్ పాత్ర ఉందని పోసాని వెల్లడించినట్టు తెలుస్తోంది.

ముందస్తు బెయిల్ పై సజ్జల స్పందన
పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలతో సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ అప్రమత్తమైనట్టు సమాచారం. ఈ క్రమంలో, తమపై తప్పుడు ఆరోపణలు వేస్తున్నారని పేర్కొంటూ ముందస్తు బెయిల్ కోసం వారు కోర్టును ఆశ్రయించారు. తాము ఎలాంటి అక్రమ చర్యలకు పాల్పడలేదని, రాజకీయ కక్షతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కోర్టుకు సమర్పించిన పిటిషన్‌లో వారు స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, సజ్జల భార్గవ్ మరియు రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయడంపై టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తప్పు చేయకపోతే ముందస్తు బెయిల్ అవసరం ఏమిటని ప్రశ్నిస్తూ, గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిర్బంధ అరెస్టులు, అనుచిత వ్యాఖ్యల ద్వారా ప్రతిపక్షాలను కష్టాలు పెట్టారని, ఇప్పుడు దాని ఫలితాన్ని అనుభవించాల్సి వస్తోందని వారు అంటున్నారు.

పోసాని కృష్ణమురళి అరెస్టు, ఆయన పోలీసుల ఎదుట చేసిన వ్యాఖ్యలు, సజ్జల కుటుంబ సభ్యుల ముందస్తు బెయిల్ ప్రయత్నం – ఇవన్నీ ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరిన్ని పరిణామాల కోసం వేచి చూడాల్సిందే.

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories