సూపర్ 6 పథకాన్ని అర్ధాంతరంగా నిలిపివేసిన ఏపీలోని టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు మేలు చేసే పథకాలను పక్కనబెట్టి, వీరు చేస్తున్న హడావుడి, నాటకాలు ప్రజల ఆగ్రహానికి కారణమవుతున్నాయి. సొంత పనులు చక్కబెట్టుకుంటూ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ, సాంస్కృతిక కార్యక్రమాలతో ఎంజాయ్ చేస్తున్న వీరి తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఒకవైపు రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే.. మరోవైపు టీడీపీ నేతలు మాత్రం తమ హంగు ఆర్భాటాలకు ఏమాత్రం తగ్గడం లేదు. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టకుండా, ప్రజల సమస్యలు పట్టించుకోకుండా.. కేవలం హడావుడి చేయడం, మీడియాలో కనపడటం కోసమే వీరు ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
ఇక ఈ తతంగానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా మద్దతు తెలుపుతున్నట్లు కనిపిస్తోంది. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా, వీరిద్దరూ కలిసి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ నవ్వుతూ తుల్లుతూ ఉండటం చూసి ప్రజలు మండిపడుతున్నారు. “మాకు పథకాలు ఆపేశారు.. వీళ్లేమో ఎంజాయ్ చేస్తున్నారు” అంటూ సామాన్యులు సోషల్ మీడియాలో తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాధనంతో నిర్వహిస్తున్న ఈ తంతు ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు తమ ప్రవర్తన మార్చుకుని, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని.. లేదంటే రాబోయే రోజుల్లో ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.
మొత్తానికి సూపర్ 6 ఆపేసిన టీడీపీ నేతల తీరు, ప్రజాధనం దుర్వినియోగం, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల ఎంజాయ్మెంట్ వ్యవహారం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రజలు మాత్రం తమ అసహనాన్ని సోషల్ మీడియా వేదికగా వెళ్లగక్కుతున్నారు.
వీడియో