Top Stories

పవన్ హాసన్.. వైరల్ వీడియో

 

మొన్నటివరకు చంద్రబాబు నాయుడు రిటైర్ అవ్వాలని సూచించిన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏకంగా చంద్రబాబు వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. “దేశానికి మోదీ మూడోసారి ప్రధాని అయ్యినట్టు…చంద్రబాబు కూడా వరుసగా మూడు సార్లు సీఎం అవ్వాలి. చంద్రబాబు నాయకత్వంలో పనిచేసేందుకు నేను సిద్ధం” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ పెద్ద దుమారం రేపుతున్నాయి.

గతంలో చంద్రబాబు వయసు మీద పడిందని, ఆయన తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ నెటిజన్లు ఆయనపై తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. “నిన్న మొన్నటి వరకు రిటైర్మెంట్ ఇవ్వమన్నారు.. ఇప్పుడు ఏకంగా హ్యాట్రిక్ కొట్టమంటున్నారు.. ఇది కదా రాజకీయమంటే!” అంటూ ఒక నెటిజన్ వ్యంగ్యంగా కామెంట్ చేశారు.

మరో నెటిజన్ అయితే పవన్ కళ్యాణ్ మాట మార్చడంలో కమల్ హాసన్‌ను కూడా మించిపోయారని ఎద్దేవా చేశారు. “కమల్ హాసన్ కూడా ఇంతలా మాట మార్చి ఉండరు.. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు” అంటూ కామెంట్ పెట్టారు.

కొందరు నెటిజన్లు అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సమర్థిస్తూ, రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయకత్వం అవసరమని అభిప్రాయపడుతున్నారు. అయితే, మెజారిటీ నెటిజన్లు మాత్రం పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఆయనను ట్రోల్ చేస్తున్నారు.

“నాలుక మడత పెట్టడంలో పవన్ కళ్యాణ్ తర్వాతే ఎవరైనా” అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మీమ్స్, జోక్స్ రూపంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

మొత్తానికి, పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలు ఆయన రాజకీయ ప్రయాణంలో మరో ఆసక్తికరమైన మలుపుగా చెప్పుకోవచ్చు. అయితే, ఈ వ్యాఖ్యలు ఆయన అభిమానులను, రాజకీయ విశ్లేషకులను ఏ మేరకు మెప్పిస్తాయో వేచి చూడాలి. ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో మాత్రం పవన్ కళ్యాణ్ ట్రోలింగ్ మెటీరియల్‌గా మారిపోయారు.

వీడియో

Trending today

బిగ్ బ్రేకింగ్ : జగన్ పాదయాత్ర.. ఎప్పుడంటే?

2019 ఎన్నికల ముందు రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన...

ఏబీఎన్ వెంకటకృష్ణ ఓపెన్ అయిపోయాడు..

రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం ఇప్పుడు మరింత ఆసక్తికర మలుపు...

మొన్న బాబు.. నేడు పవన్.. ఇదీ ఘోరం..

రాష్ట్రంలో కల్తీ మాఫియా మరోసారి విరుచుకుపడుతోంది. కొద్దిరోజుల క్రితం సీఎం చంద్రబాబు...

కేశినేని చిన్ని ఖేల్ ఖతం

తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్) రాజకీయంగా క్లిష్ట...

వైసీపీకి 40 శాతం ఓట్లు వెనుక వాళ్లే

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాలంటీర్ల వ్యవస్థ ఒకప్పుడు ప్రజలతో ప్రభుత్వాన్ని కలిపిన బలమైన...

Topics

బిగ్ బ్రేకింగ్ : జగన్ పాదయాత్ర.. ఎప్పుడంటే?

2019 ఎన్నికల ముందు రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన...

ఏబీఎన్ వెంకటకృష్ణ ఓపెన్ అయిపోయాడు..

రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం ఇప్పుడు మరింత ఆసక్తికర మలుపు...

మొన్న బాబు.. నేడు పవన్.. ఇదీ ఘోరం..

రాష్ట్రంలో కల్తీ మాఫియా మరోసారి విరుచుకుపడుతోంది. కొద్దిరోజుల క్రితం సీఎం చంద్రబాబు...

కేశినేని చిన్ని ఖేల్ ఖతం

తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్) రాజకీయంగా క్లిష్ట...

వైసీపీకి 40 శాతం ఓట్లు వెనుక వాళ్లే

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాలంటీర్ల వ్యవస్థ ఒకప్పుడు ప్రజలతో ప్రభుత్వాన్ని కలిపిన బలమైన...

లోకేష్-తిలక్ వర్మ ఒక్కటేనట

ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్న వేళ.. మీడియా ఎలివేషన్లు కూడా హీట్ పెంచుతున్నాయి....

ఫోన్ ట్యాప్.. 10 కోట్లు డిమాండ్.. TV5 మూర్తిపై కేసు నమోదు

ప్రముఖ జర్నలిస్టు టీవీ5 మూర్తిపై కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు....

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏపీ పార్టీలు..

తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రెండు తెలుగు...

Related Articles

Popular Categories