సోషల్‌మీడియాలో ప్రస్తుతం ఓ కొత్త ట్రెండ్ హల్‌చల్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్) వంటి ప్రముఖ సోషల్‌మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లోకి లాగిన్ అయితే, మొత్తం ఫీడ్ జీబ్లీ స్టైల్ ఫోటోలతో నిండిపోయినట్లు కనిపిస్తోంది.
ఈ ట్రెండ్‌కు ప్రధాన కారణం ఓపెన్‌ఏఐ తాజాగా చాట్‌జీపీటీలో జీబ్లీ (Ghibli) స్టూడియో స్టైల్‌ను ప్రవేశపెట్టడం. ఈ కొత్త ఆప్షన్ ద్వారా, వినియోగదారులు తమ ఫోటోలను జపాన్ అనిమేషన్ స్టూడియో ‘స్టూడియో జీబ్లీ’ తరహాలో మారుస్తూ, వాటిని సోషల్‌మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ఈ స్టైల్ వినియోగదారుల నుంచి భారీ స్పందన అందుకుంటోంది.
ఈ ట్రెండ్ ప్రభావంతో చాట్‌జీపీటీ యూజర్ల సంఖ్య కూడా అమాంతం పెరిగిపోయింది. కేవలం ఒక గంటలోనే 10 లక్షల మంది కొత్తగా చేరినట్లు ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ (Sam Altman) తెలిపారు. ఆయన ఈ విషయాన్ని ఎక్స్ (Twitter) వేదికగా వెల్లడిస్తూ, ఈ విపరీతమైన వృద్ధిని అద్భుతంగా పేర్కొన్నారు.
శామ్ ఆల్ట్‌మన్ మరో ఆసక్తికర విషయాన్ని గుర్తుచేశారు. రెండు సంవత్సరాల క్రితం చాట్‌జీపీటీ మొదటిసారి విడుదలైనప్పుడు, 1 మిలియన్ (10 లక్షల) యూజర్లు చేరడానికి ఐదు రోజులు పట్టింది. కానీ ఇప్పుడు గంటలోనే 1 మిలియన్ యూజర్లు చేరడం అద్భుతమని అన్నారు.