Top Stories

జగన్ మళ్లీ ఆళ్లపై దృష్టి: అమరావతిలో ఆస్త్రం సిద్ధం?

అమరావతి రాజధాని నిర్మాణం మళ్లీ ఊపందుకోవడంతో, ఈ వ్యవహారంలో జగన్ కీలక నిర్ణయాలు తీసుకోవాలని చూస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌ మొదటి నుంచీ అమరావతి అంశంలో తడబడుతూ వస్తున్నప్పటికీ, ఇప్పుడు సరికొత్త వ్యూహానికి పూనుకుంటున్నట్లు సమాచారం.

తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలోకి వచ్చాక అమరావతిని రాజధానిగా నిర్ణయించింది. అప్పట్లో జగన్‌ కూడా దానికి ఎత్తిపోతలుగా నిరసన తెలియచేయలేదు. ఎందుకంటే అమరావతికి వ్యతిరేకత రాజకీయంగా సమస్యలు తెచ్చిపెడుతుందన్న ఆలోచన ఆయనకు ఉండేది. అప్పుడు జగన్ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని వ్యూహాత్మకంగా వినియోగించారు. రైతులు ఇచ్చిన భూముల విషయంలో అసంతృప్తి ఉన్నవారిని ప్రోత్సహించి, కోర్టుల్లో కేసులు వేయించడంలో ఆళ్ల కీలకపాత్ర పోషించారు. ఆ కేసుల మీద వస్తున్న తీర్పులను వైసీపీ విస్తృతంగా ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందింది.

తాజా ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వకుండా బీసీ నాయకురాలు కాండ్రు కమలను నిలిపారు. కానీ నారా లోకేష్ ఘనవిజయం సాధించడంతో ఆ ప్లాన్ విఫలమైంది. ఆ తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి కొంతకాలం కాంగ్రెస్‌లోకి వెళ్లి మళ్లీ వైసీపీ లోకి తిరిగివచ్చారు. ఎన్నికల్లో పార్టీకి సపోర్ట్ ఇచ్చినా విజయాన్ని సాధించలేకపోయారు.

ఇప్పుడు పరిస్థితులు మారడంతో జగన్ మళ్లీ ఆళ్లపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలపై అవినీతి, లోపాలను బయటకు తీసి రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఆళ్లను ఇన్‌చార్జ్ చేయాలని జగన్ నిర్ణయించారని సమాచారం. పార్టీ స్థాయిలో అధికారిక బాధ్యతలు అప్పగించి, అమరావతి అంశంపై పూర్తి దృష్టి పెట్టేలా ఆళ్లను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి, ఒకప్పుడు వదిలేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు జగన్‌కు మళ్లీ అవసరమయ్యారు. అందుకే, ఆయనను పిలిచి మరీ అమరావతిలో కీలక పాత్ర ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.

Trending today

‘బిగ్ బాస్ 9’ లోకి దండుపాళ్యం మూవీ హీరోయిన్..

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈసారి భారీ అంచనాలతో మొదలుకానుంది....

మర్యాద మనీష్ కాదు.. అమర్యాద మనీష్!

  జియో హాట్ స్టార్ లో ప్రసారం అవుతున్న ‘అగ్నిపరీక్ష’ రియాలిటీ షో...

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ లో దమ్ము చూపించిన శ్రీజ

  బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 9 సీజన్‌కు ముందు...

సీటు కోసం మగాడిని కొట్టిన మహిళ

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) బస్సులో సీటు కోసం...

Topics

‘బిగ్ బాస్ 9’ లోకి దండుపాళ్యం మూవీ హీరోయిన్..

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈసారి భారీ అంచనాలతో మొదలుకానుంది....

మర్యాద మనీష్ కాదు.. అమర్యాద మనీష్!

  జియో హాట్ స్టార్ లో ప్రసారం అవుతున్న ‘అగ్నిపరీక్ష’ రియాలిటీ షో...

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ లో దమ్ము చూపించిన శ్రీజ

  బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 9 సీజన్‌కు ముందు...

సీటు కోసం మగాడిని కొట్టిన మహిళ

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) బస్సులో సీటు కోసం...

ఏయ్.. నవ్వకండే

  టీవీ5 చానెల్‌లో సీనియర్ యాంకర్‌గా ఉన్న సాంబశివరావు మరోసారి సోషల్ మీడియాలో...

మనిషివా.. మహా వంశీవా?

  మహా టీవీ యాంకర్ వంశీ మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో...

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

Related Articles

Popular Categories