Top Stories

ఏపీ క్యాబినెట్‌లో భారీ మార్పులు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మార్పుల దిశగా వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి జూన్ 4తో ఏడాది పూర్తి అవుతున్న తరుణంలో, మంత్రివర్గంలో భారీ మార్పుల‌కు సన్నాహాలు జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది.

ఏడాది పాలన – సమీక్ష ప్రారంభం
2024 జూన్ 4న టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అభివృద్ధిపై దృష్టి సారించిన ప్రభుత్వం, అమరావతి రాజధాని నిర్మాణాన్ని మళ్లీ మొదలుపెట్టింది. పలు సంక్షేమ పథకాలు కూడా ఈ ఏడాది ప్రారంభమయ్యాయి. కానీ రాజకీయ పటిష్టత పెంచుకోవడానికి మంత్రివర్గ ప్రక్షాళనను చంద్రబాబు అస్త్రంగా వినియోగించనున్నారని ప్రచారం జరుగుతోంది.

నామినేటెడ్ పదవులు – విస్తరణ కసరత్తు
ఇప్పటికే చాలామందికి నామినేటెడ్ పదవులు కేటాయించిన ప్రభుత్వం, మిగిలిన ఖాళీలను త్వరలో భర్తీ చేయనుంది. అంతేగాక, క్యాబినెట్ విస్తరణపై కూడా మంతనాలు జరుపుతోంది. ప్రస్తుతం ఒక మంత్రి పదవి ఖాళీగా ఉండగా, ఆ స్థానాన్ని మెగా బ్రదర్ నాగబాబుతో భర్తీ చేయనుందని సమాచారం. ఆయనను ఇప్పటికే ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారు. మంత్రిగా అవకాశం కల్పించడం ఇప్పుడు కేవలం టైమింగ్‌ మేటరే అంటున్నారు విశ్లేషకులు.

బిజెపి డిమాండ్ – మరో మంత్రి పదవి
ఇప్పటికే కేంద్రంలో టిడిపికి రెండు మంత్రి పదవులు ఉన్నా, రాష్ట్రంలో బిజెపికి సరైన ప్రతినిధిత్వం లేదని కేంద్ర నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే బిజెపికి మరో మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ వస్తోంది. ఇది జరిగితే మరొక మంత్రి పదవి ఖాళీ చేయాల్సి వస్తుంది. ఒక్కరిని తొలగిస్తే వివాదాస్పదమవుతుందని భావించిన చంద్రబాబు, పనితీరు బాగా లేని ముగ్గురు నుంచి ఐదుగురు మంత్రులను మారుస్తారని సమాచారం.

పనితీరు ఆధారంగా ఔట్ అయిన మంత్రులు?
ముఖ్యంగా గోదావరి, ఉత్తరాంధ్ర, రాయలసీమకు చెందిన ముగ్గురు మంత్రులపై తీవ్ర అసంతృప్తి ఉందని తెలుస్తోంది. వారిపై విమర్శలు, పనితీరు లోపాలపై ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు వచ్చినా మార్పులు కనిపించకపోవడంతో, చివరకు వైద్యం చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

నాగబాబు, బిజెపి నేతలకు అవకాశం
ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలికితే, నాగబాబు‌తో పాటు బిజెపి ఎమ్మెల్యేకు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిణామాలతో పాటు, కొత్త ఆశావహులకు అవకాశం ఇవ్వాలన్న ఒత్తిడిలోనూ చంద్రబాబు ఉన్నారు. అయితే ఇదే సమయంలో పార్టీకి బలం చేకూరేలా ఆచితూచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

ఎన్డీఏ ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తవుతున్న ఈ సమయంలో క్యాబినెట్ లో మార్పులు జరగటం ఖాయం అనిపిస్తోంది. అయితే ఎవరెవరికి ఔట్ పాస్, ఎవరెవరికి లక్కీ ఛాన్స్ అంటారు అన్నది మరో కొన్ని రోజుల్లో స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో వాతావరణం మరింత వేడెక్కే అవకాశం ఉంది.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories