గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయంలో పట్టపగలే అధికారులు రాసలీలల్లో మునిగితేలారనే ఆరోపణలు సంచలనం సృష్టించాయి. విధుల్లో ఉండగానే ఓ జంట లిప్ కిస్సులతో రెచ్చిపోయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
సమాచారం ప్రకారం, ఈ ఘటన మున్సిపల్ కార్యాలయంలోనే జరిగిందని, వీడియోలో ఉన్నవారు నూతనంగా ఉద్యోగంలో చేరిన బల్దియా అధికారులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. పగటిపూట, కార్యాలయంలోనే ఇలాంటి సంఘటన జరగడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు సమాచారం. దీనిపై ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించి, సంబంధిత అధికారులను మందలించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో విధుల పట్ల బాధ్యత లేకుండా ఇలాంటి చర్యలకు పాల్పడటం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.