Top Stories

కోల్‌కతాలో కొడాలి నాని అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంటోంది. ముఖ్యంగా అధికార కూటమి ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో కీలక అరెస్టులు జరిగాయి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ కాగా, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ కొనసాగుతోంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక మాజీ మంత్రి కొడాలి నానిని కూడా కోల్‌కత్తా విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.

కొడాలి నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదు కాగా, ఏపీ పోలీసులు ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేయగా, కోల్‌కత్తా నుంచి కొలంబో వెళ్లే సమయంలో ఎయిర్‌పోర్టులో పోలీసులు అడ్డుకున్నట్టు సమాచారం. అక్కడి ఎయిర్‌పోర్టు అధికారులు వెంటనే ఏపీ పోలీసులకు సమాచారం అందించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కొడాలి నానిపై దృష్టి సారించింది. అనేక కేసులు నమోదు చేస్తూ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఆరోగ్య సమస్యల కారణంగా కొడాలి నాని ఇటీవల ముంబైలో బైపాస్ సర్జరీ కూడా చేయించుకున్నారు. ఆపరేషన్ అనంతరం విశ్రాంతి తీసుకుంటూ తిరిగి సాధారణ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. అప్పట్లో అమెరికా వెళ్తున్నారనే వార్తలు వినిపించాయి. దాంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడైనా విదేశాలకు వెళ్లకుండానే ఉండేందుకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన కుటుంబ వివాహ వేడుకకు హాజరైన కొడాలి నాని విదేశాలకు వెళ్లే ఆలోచన లేదనిపించినా, ఇప్పుడు కోల్‌కత్తాలో అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయనను ఏపీకి తీసుకొచ్చే ఏర్పాట్లు జరుగుతాయా? లేక అక్కడే విచారణ కొనసాగుతుందా? అన్నదే ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతోంది.

టీడీపీ శ్రేణులు కొడాలి నానిపై విమర్శలు గుప్పిస్తూ వస్తుండగా, ఇప్పుడు ఈ అరెస్టు అంశం మరోసారి రాజకీయ వేడి పెంచనుంది. పూర్తిస్థాయి వివరాల కోసం అధికారిక ప్రకటన ఎదురుచూడాల్సి ఉంది.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories