వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు 137 రోజుల పాటు జైలులో గడిపిన వంశీ, విడుదలయ్యాక పూర్తిగా మారిపోయిన లుక్ లో కనిపించి అందరినీ షాక్ కు గురిచేశారు.
నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో వల్లభనేని వంశీకి సంబంధించిన అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించినట్లయింది. ఈరోజు జిల్లా జైలు నుంచి బయటకు వచ్చిన వంశీని చూసిన వారంతా ఆశ్చర్యపోయారు.
ఆయన ముఖం పూర్తిగా పాలిపోయి, జుట్టు తెల్లబడి, చాలా బలహీనంగా కనిపించారు. జైలు జీవితం ఆయనపై ఎంతగా ప్రభావం చూపిందో ఆయన రూపాన్ని చూస్తే అర్థమవుతుంది. గతంలో చురుగ్గా కనిపించే వంశీ, ఇప్పుడు నిస్సత్తువగా మారిపోవడంతో ఆయన అభిమానులు, అనుచరులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.