Top Stories

లోకేష్ మనసులో మాట

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా విద్యా రంగంలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన ప్రసంగంలోని కొన్ని భాగాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, విపక్షాల నుంచి, విద్యా విశ్లేషకుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాయి.

లోకేష్ మాట్లాడుతూ “మంత్రి నారాయణ లక్ష్యం ప్రభుత్వ పాఠశాలల మూసివేత” అని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. గతంలో నారాయణపై ఉన్న “ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి తన ప్రైవేట్ విద్యాసంస్థల అభివృద్ధికి బాటలు వేసిన వ్యక్తి” అనే ఆరోపణలకు లోకేష్ వ్యాఖ్యలు బలాన్ని చేకూర్చాయని పలు వర్గాలు అంటున్నాయి. ఈ వ్యాఖ్యలు విపక్షాలకు ఒక అస్త్రంగా మారాయి.

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతపై మాట్లాడుతూ లోకేష్ చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి కారణమయ్యాయి. “ఆ భోజనం తిన్న చంద్రబాబుకు కూడా నచ్చలేదు. నేను కూడా చెప్పాను బాగా లేదని” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించబడుతున్న వనరులు, పర్యవేక్షణ పద్ధతులపై మరోసారి దృష్టిని కేంద్రీకరించాయి. ఒక విద్యాశాఖ మంత్రిగా ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న భోజనంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

లోకేష్ వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఆయనకు విద్యాశాఖ బాధ్యతలను అప్పగించడం “అనర్హతకు సంకేతం” అని ఆరోపిస్తున్నాయి. “ఆయన మాటలు, ఉద్దేశం రెండూ విద్యాసంస్థల ప్రాధాన్యతను హేళన చేయడమే” అని విపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. విద్యా రంగంలో ఎన్నో సమస్యలు, మార్పులు జరుగుతున్న తరుణంలో మంత్రుల నుంచి వస్తున్న ఈ తరహా వ్యాఖ్యలు విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

https://x.com/VoicesOfAndhra/status/1942161315683831859

Trending today

జగన్ వస్తున్నాడంటే ఆ మాత్రం ఉండాలి

ఈనెల 9వ తారీఖున చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాలెం మండలంలోని...

టీడీపీలో టెన్షన్!

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెద్దపరిమి గ్రామ రైతులు ల్యాండ్ పూలింగ్...

కేంద్రానికి బాబుపై ఐఏఎస్, ఐపీఎస్ ల ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా కొలువుదీరిన టీడీపీ కూటమి ప్రభుత్వంపై కొందరు ఐఏఎస్, ఐపీఎస్...

భయపడ్డ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ

'కొత్త పలుకు'లో బీఆర్ఎస్ తెలంగాణ జాగీరా అంటూ ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ రాసిన...

బాబు రిటర్న్ గిఫ్ట్

రాష్ట్రంలో రేషన్ పంపిణీ తీరుపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది....

Topics

జగన్ వస్తున్నాడంటే ఆ మాత్రం ఉండాలి

ఈనెల 9వ తారీఖున చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాలెం మండలంలోని...

టీడీపీలో టెన్షన్!

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెద్దపరిమి గ్రామ రైతులు ల్యాండ్ పూలింగ్...

కేంద్రానికి బాబుపై ఐఏఎస్, ఐపీఎస్ ల ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా కొలువుదీరిన టీడీపీ కూటమి ప్రభుత్వంపై కొందరు ఐఏఎస్, ఐపీఎస్...

భయపడ్డ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ

'కొత్త పలుకు'లో బీఆర్ఎస్ తెలంగాణ జాగీరా అంటూ ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ రాసిన...

బాబు రిటర్న్ గిఫ్ట్

రాష్ట్రంలో రేషన్ పంపిణీ తీరుపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది....

ఇదేనా మంచి ప్రభుత్వం 

గోదావరి గడ్డ మీద నుంచి ఓ యువకుడు గొంతెత్తిండు. వాడు అడిగినయన్నీ...

జగన్ అంటే ఎంత అభిమానం..

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన కేడర్ ఉందనేది కాదనలేని సత్యం. ఇప్పటికీ...

‘బాబోరి’కి మళ్లీ పంచ్

ఆంధ్రప్రదేశ్‌లో సూపర్‌ సిక్స్‌ పథకాల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రజల...

Related Articles

Popular Categories