Top Stories

ఏబీఎన్ RK వాయిస్ వినిపించేది ఈమె!

ప్రతీ ఆదివారం తెలుగు ప్రజల చెవులను హోరెత్తించి, నిద్ర లేపి, అప్పుడప్పుడూ భయపెట్టి.. “వీకెండ్ కామెంట్ బై ఆర్కే” అంటూ గంభీరంగా గొంతు సవరించి మాట్లాడే ఆ మిస్టీరియస్ వాయిస్ వెనుక ఉన్న ‘అక్క’ ఎవరో ఎట్టకేలకు బయటపడింది. ఏళ్ల తరబడి తెలుగు రాష్ట్రాల్లో ఒక పజిల్ లా ఉన్న ఈ వాయిస్ ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యక్షమై, తన అసలు రూపాన్ని  ప్రపంచానికి పరిచయం చేసింది.
ఇన్నాళ్లూ చాలామందికి ఆసక్తి ఉండేది.. అసలు ఆ వాయిస్ ఎవరు? ఆమె ఎలా ఉంటుంది? నిజంగానే ఆమె వాయిస్ అంత ‘కర్ణ కఠోరంగా’ ఉంటుందా? లేక మైక్ ఎఫెక్ట్‌తో అలా వినిపిస్తుందా? అని. ఆ స్వరం వినగానే చాలామందికి గుండెల దడ మొదలయ్యేది. ముఖ్యంగా ఆదివారం ఉదయం నిద్ర లేవగానే టీవీ ఆన్ చేస్తే, “ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక సుడిగుండంలో చిక్కుకున్నాయి…”, “ప్రజలు గమనించాలి…”, “అధికార పక్షం ఆలోచించాలి…” అంటూ ఆ వాయిస్ వినిపిస్తే, పక్కింటి కుక్కలు కూడా వణికేవని కొందరు హాస్యంగా వ్యాఖ్యానించేవారు.
కానీ ఇప్పుడు ఆ రహస్యం వీడింది. ఒక యూట్యూబ్ ఛానెల్‌లో ఆమె స్వయంగా కనిపించి, తన గంభీరమైన గళంతో పలకరించగానే, చాలామంది “అవునా, ఈ వాయిసేనా అది!” అంటూ ఆశ్చర్యపోయారు. కొందరైతే “ఊహించలేదు, ఆ వాయిస్ ఒక మహిళది అని” అంటూ నోరెళ్లబెట్టారు. ఇంకొందరు “అవునా అక్కా, నువ్వేనా ఆ వాయిస్ ఇచ్చేది?” అంటూ ఆత్మీయంగా పలకరించారు.
ఏదేమైనా ‘ఆర్కే వాయిస్’ వెనుక ఉన్న ‘కర్ణ కఠోర మహిళ’ అంటూ కొందరు సెటైర్లు వేసినా, ఆమె పడిన కష్టానికి, ఆ గొంతుకు ఇప్పుడు సరైన గుర్తింపు వచ్చింది. ఇకపై ఆమె బయట ఎక్కడ కనిపించినా, “అక్కా, మీ వాయిస్ చాలా భయంకరంగా ఉంటుంది” అని అనడానికి బదులు, “మీ వాయిస్ వింటేనే పాలిటిక్స్ అర్థమవుతాయి” అని అంటారేమో చూడాలి. మొత్తానికి, ‘రాధాకృష్ణ ఆర్కే వాయిస్’ వెనుక ఉన్న రహస్యం వీడటంతో, తెలుగు మీడియాలో ఒక పెద్ద మిస్టరీకి తెరపడింది! https://x.com/Anithareddyatp/status/1945310336770609191

Trending today

చంద్రబాబు చేతుల్లో ప్రభుత్వ ఉద్యోగులు బలి!

దీపావళి పండగను ముందు పెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగులు పండగ వాతావరణంలో ఉండాలని...

గూగుల్ తో అన్ని ఉద్యోగాలు రావా?

విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణంపై భారీ హంగామా సృష్టించిన...

పవన్ పై కాపుల కారాలు మిరియాలు

Pawan Kalyan ం జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై...

పిఠాపురం వర్మను డమ్మీని చేసిన పవన్

పిఠాపురం రాజకీయాలు మరోసారి కదలికలోకి వచ్చాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌...

పవన్ మొహం మాడిపోయింది..

ప్రధాని నరేంద్రమోదీ తాజా ఆంధ్రప్రదేశ్ పర్యటనలో జరిగిన ఒక సన్నివేశం ఇప్పుడు...

Topics

చంద్రబాబు చేతుల్లో ప్రభుత్వ ఉద్యోగులు బలి!

దీపావళి పండగను ముందు పెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగులు పండగ వాతావరణంలో ఉండాలని...

గూగుల్ తో అన్ని ఉద్యోగాలు రావా?

విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణంపై భారీ హంగామా సృష్టించిన...

పవన్ పై కాపుల కారాలు మిరియాలు

Pawan Kalyan ం జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై...

పిఠాపురం వర్మను డమ్మీని చేసిన పవన్

పిఠాపురం రాజకీయాలు మరోసారి కదలికలోకి వచ్చాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌...

పవన్ మొహం మాడిపోయింది..

ప్రధాని నరేంద్రమోదీ తాజా ఆంధ్రప్రదేశ్ పర్యటనలో జరిగిన ఒక సన్నివేశం ఇప్పుడు...

పవన్ ను టీజ్ చేసిన పేర్నినాని..

మాజీ మంత్రివర్యులు పేర్ని నాని గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై...

టీవీ5 సాంబశివరావు “క్లాసిక్ లాంగ్వేజ్”

టీవీ5 యాంకర్ సాంబశివరావు వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి....

తట్టుకోలేకపోయిన ఏబీఎన్ వెంకటకృష్ణ

కర్నూలులో జరిగిన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...

Related Articles

Popular Categories