ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల సభలు, సమావేశాల్లో దోమల నిర్మూలనపై దృష్టి సారించడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. వర్షాకాలం వచ్చిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కనపెట్టి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టకుండా దోమల నివారణను భుజానకెత్తుకున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో, గతంలో టీవీ5 సాంబశివరావు చెప్పిన ఒక సరదా కథ మళ్ళీ వైరల్ అవుతోంది.
గతంలో ఒక సందర్భంలో టీవీ5 సాంబశివరావు “చంద్రబాబు లాంటి స్టేటస్ మనిషికి దోమలు కుట్టడమా?” అంటూ మాట్లాడిన వీడియోలు ఇప్పుడు ట్రోల్స్‌కు దారితీస్తున్నాయి. సాంబశివరావు తనదైన శైలిలో, ఒక మాజీ సీఎం చంద్రబాబును జైలులో దోమ కుట్టడం దారుణం అంటూ చెప్పిన కథ అప్పట్లో చాలా మందిని నవ్వించింది. చంద్రబాబుకు ఉన్న “స్టేటస్” కారణంగా దోమలు కూడా ఆయన దరిదాపుల్లోకి రావడానికి వెనుకాడతాయని, ఒకవేళ వచ్చినా కుట్టడానికి భయపడతాయని సాంబశివరావు సెటైర్ వేశారా? అని అందరూ ట్రోల్స్ చేస్తున్నార. .
ఇప్పుడు, చంద్రబాబు దోమల నిర్మూలనను ప్రస్తావించడంతో, సాంబశివరావు పాత వీడియోలను వెలికితీసి, “చంద్రబాబు లాంటి స్టేటస్ మనిషికి దోమలు కుట్టడమా?” అంటూ నెటిజన్లు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని, అసలు సమస్యలను పక్కనపెట్టి దోమల గురించి మాట్లాడుతున్నారని సోషల్ మీడియాలో ట్రోల్స్ కొనసాగుతున్నాయి. ఈ వ్యవహారంపై మీ అభిప్రాయం ఏమిటి?