అమరావతి పనులపై గోదావరి యాసలో ఓ యువకుడు వేసిన సెటైర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణంపై అనుసరిస్తున్న విధానాలపై అతను ఘాటుగా స్పందించాడు.
“ఫేస్ 1 పనులు పూర్తి కాకముందే, ఫేస్ 2 భూసేకరణ పేరుతో అమరావతిలో ఇంకొన్ని భూముల్ని రైతుల కాన్నుంచి లాక్కొని, వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి ఇంకొన్ని అప్పులు చేసి, ఫేస్ 1 పూర్తి చేయాలని బాబు స్కెచ్ గీసిండంట కదా!” అంటూ యువకుడు తన గోదావరి యాసలో ఆరోపణలు గుప్పించాడు.
రైతుల భూములను లాక్కోవడంపై అతను తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. “ఫేస్ 1 కోసం ఫేస్ 2, ఫేస్ 2 కోసం ఫేస్ 3 అంటూ అమరావతి కోసం చంద్రబాబు జిమ్మిక్కులు చేస్తున్నడు. రైతుల భూములు లాక్కుంటే వాళ్లు ఎట్లా తింటారు? ఎట్లా బతుకుతారు?” అంటూ ప్రశ్నించాడు. ఈ అప్పులతో బాబు చేస్తున్నది స్కామ్ అంటూ యువకుడు సెటైర్లు వేశాడు. అతని మాటలు రైతుల ఆవేదనను, పాలకుల తీరుపై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తున్నాయి.