Top Stories

కొలికపూడి మళ్లీ కెలికాడు

 

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి వార్తల్లోకెక్కారు. ఆయన గెలిచినప్పటి నుండి అనేక వివాదాస్పద అంశాల్లో చిక్కుకున్నారు. ఒక దశలో పార్టీ అధిష్టానం ఆయన విషయంలో కఠిన చర్యలకు సిద్ధమవుతోందని ప్రచారం జరిగింది. ఇటీవల కొలికపూడి వ్యవహారం సద్దుమణిగినప్పటికీ, ఇప్పుడు మరో కలకలం రేగింది. ఎమ్మెల్యే కొలికపూడి వేధిస్తున్నారని ఆరోపిస్తూ, ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి ఒక ఉద్యోగి అదృశ్యమయ్యాడు. ఇది ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఇటీవల జరిగిన ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో భాగంగా, ఎన్టీఆర్ జిల్లాలోని మైనర్ ఇరిగేషన్ సెక్షన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి. కిషోర్ బదిలీ అయ్యారు. అయితే, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో పాటు ఉన్నతాధికారులు తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ కిషోర్ ఒక లేఖ రాశారు. ఆ లేఖను తమ శాఖకు చెందిన ఉద్యోగుల వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేసి, ఆ తర్వాత కనిపించకుండా పోయారు. కిషోర్ రాసిన లేఖకు రక్తపు మరకలు ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

కిషోర్ గత నెలలోనే బదిలీ అయ్యారు. తిరువూరులోని తన అద్దె ఇంటిని కూడా ఖాళీ చేశారు. శుక్రవారం ఉదయం కిషోర్ మావయ్య ఆయన్ను కారులో ఆఫీసులో దింపారు. అయితే, మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఆఫీసు నుంచి నడుచుకుంటూ బయటకు వెళ్లిపోయారని స్థానికులు చెబుతున్నారు.

కిషోర్ రాసిన సూసైడ్ నోట్‌గా భావిస్తున్న ఆ లేఖను చూసిన తోటి శాఖ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, కిషోర్ మొబైల్ ఫోన్‌ను ట్రేస్ చేశారు. చివరిసారిగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వి.ఎం. బంజారా వద్ద సిగ్నల్ ట్రాక్ అయింది. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు.

శ్రీనివాసరావు పేరును ప్రస్తావించారు. “నా చావుకు జలవనరుల శాఖ ఈఈ గంగయ్య, డిఈఈ ఉమా శంకర్, ఈఎన్సీ శ్యాంప్రసాద్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కారణం. బదిలీ జరిగినా రిలీవ్ చేయకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నాను. నాకు జలవనరుల శాఖ సాధారణ బదిలీల్లో గౌరవరం సెక్షన్‌కు బదిలీ జరిగింది. కానీ ఉద్దేశపూర్వకంగానే బదిలీ ఆపి రాజకీయం చేశారు. నా బదిలీని అడ్డుకునేందుకు రాజకీయంగా ప్రయత్నించారు. నేను దళిత ఉద్యోగిని. నాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు. సీనియర్ అసిస్టెంట్ దుర్గాప్రసాద్, మంత్రి పీఏ బొట్టు శ్రీనివాసరావు పై కఠిన చర్యలు తీసుకోవాలి” అని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు కిషోర్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

గత కొంతకాలంగా తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు వివాదాలకు దూరంగా ఉన్నారు. పార్టీ అధిష్టానం గట్టిగా హెచ్చరించడంతోనే ఆయన జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది. అయితే, ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎమ్మెల్యే పేరు చెప్పి సూసైడ్ నోట్ రాయడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఆ ప్రభుత్వ ఉద్యోగి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఒకవేళ జరగరానిది జరిగితే అది ఎమ్మెల్యే శ్రీనివాసరావు మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. రాజకీయ ప్రత్యర్థులకు సైతం అదో ప్రచారాస్త్రంగా మారనుంది. బదిలీల్లో రాజకీయ సిఫార్సులు సర్వసాధారణమే అయినప్పటికీ, ఈ ఘటన ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. అయితే, ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు తెలియకుండానే కొన్ని జరిగిపోతున్నాయని ఆయన అనుచరులు చెబుతున్నారు.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories