Top Stories

హరిహర వీరమల్లు’ రివ్యూ…షాక్ లగా!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు మంచి గుర్తింపు ఉంది. ఆయన నటించిన చిత్రాలు ఆయనకు ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టాయి. ఈ నేపథ్యంలోనే, భవిష్యత్తులో చేయబోయే సినిమాల విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్, అంతకు ముందు ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ‘హరిహర వీరమల్లు’ చిత్రం రేపు ఇండియాలో విడుదలవుతున్న నేపథ్యంలో, ఈరోజు యూఎస్ఏలో ప్రీమియర్ షోలు ప్రదర్శించబడ్డాయి. మరి ఈ ప్రీమియర్స్‌ను బట్టి సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

సినిమా కథాంశం:
ఈ సినిమా కథ కోహినూర్ డైమండ్ చుట్టూ తిరుగుతుంది. భాగ్యనగరం (హైదరాబాద్)లోని నిజం రాజులు దాన్ని దక్కించుకోవడానికి ఏం చేశారు? ఆ రాజులు దాని కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఇది తెలుసుకున్న వీరమల్లు ప్రజల పక్షాన ఎలా నిలబడ్డాడు? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం. పూర్తి వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
యూఎస్ఏ ప్రీమియర్‌ల ప్రకారం, ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ఆకట్టుకునే విధంగా లేదట. మధ్య మధ్యలో అనవసరమైన సన్నివేశాలు రావడంతో బోరింగ్‌గా అనిపించిందని టాక్. కంటెంట్ బాగున్నప్పటికీ, దర్శకుడు జ్యోతికృష్ణ స్టార్‌డమ్‌ను హ్యాండిల్ చేయడంలో విఫలమయ్యారని తెలుస్తోంది. భావోద్వేగ సన్నివేశాలు కూడా చాలా బలహీనంగా ఉన్నాయని, దర్శకుడు సినిమాను సమర్థవంతంగా మలచలేకపోయారని సమాచారం.

సాంకేతిక అంశాలు:
విజువల్స్ కూడా అంత ఉన్నత స్థాయిలో లేవని, గ్రాఫిక్స్ వర్క్ కూడా అనుకున్న స్థాయిలో లేదని తెలుస్తోంది. ఇవన్నీ సినిమాకు భారీ మైనస్‌లుగా మారే అవకాశాలు ఉన్నాయట. సెకండ్ హాఫ్‌లో పవన్ కళ్యాణ్ చేసే ఫైట్ సీక్వెన్సులు కొంచెం అతిగా ఉన్నాయని, క్లైమాక్స్ కూడా అంతగా ఆకట్టుకోలేదని యూఎస్ఏ ప్రేక్షకుల నుంచి వార్తలు వస్తున్నాయి.

సంగీతం & నటన:
కీరవాణి సంగీతం కొంతవరకు పర్వాలేదనిపించినా, బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ లుక్ బాగుందని, బాబీ డియోల్ గారి నటన కూడా ఆకట్టుకునే విధంగా ఉందని తెలుస్తోంది.

Trending today

జైలులో నన్ను చంపాలని చూసిందే పవన్ కళ్యాణ్

రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం చెలరేగింది. వైసీపీ మాజీ నేత...

రఘురామ కృష్ణం రాజుపై పీవీ సునీల్ సంచలన ఆరోపణ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేగింది. మాజీ ఐపీఎస్ ఆఫీసర్...

పవన్ కు అంబటి సవాల్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఉప ముఖ్యమంత్రి...

పవన్ ను బీజేపీ వదిలేస్తోందా?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై రాజకీయ ప్రచారం ఎప్పటికప్పుడు...

మోడీ, బాబు, పవన్ ను తిట్టండి.. నా జోలికి రావద్దు

టీవీ5 సీనియర్ యాంకర్ సాంబశివరావు లైవ్ డిబేట్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు...

Topics

జైలులో నన్ను చంపాలని చూసిందే పవన్ కళ్యాణ్

రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం చెలరేగింది. వైసీపీ మాజీ నేత...

రఘురామ కృష్ణం రాజుపై పీవీ సునీల్ సంచలన ఆరోపణ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేగింది. మాజీ ఐపీఎస్ ఆఫీసర్...

పవన్ కు అంబటి సవాల్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఉప ముఖ్యమంత్రి...

పవన్ ను బీజేపీ వదిలేస్తోందా?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై రాజకీయ ప్రచారం ఎప్పటికప్పుడు...

మోడీ, బాబు, పవన్ ను తిట్టండి.. నా జోలికి రావద్దు

టీవీ5 సీనియర్ యాంకర్ సాంబశివరావు లైవ్ డిబేట్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు...

గాడితప్పిన ‘బాబు’ పాలన..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన మూడు నెలలకే పాలనపై విమర్శలు మొదలయ్యాయి....

అడ్డంగా బుక్కైన నారా లోకేష్

విశాఖపట్నంలోని మధురవాడ ఐటీ హిల్ ప్రాంతంలో ఎకరా భూమిని కేవలం 99...

విమానంలో జగన్ కు ఊహించని సర్ ప్రైజ్.. వీడియో

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బర్త్‌డే వేడుకలు ముందుగానే మొదలయ్యాయి. డిసెంబర్...

Related Articles

Popular Categories